News April 24, 2025
కొరిశపాడు: గడ్డి మందు తాగి వివాహిత ఆత్మహత్య

కొరశపాడుకి చెందిన కాలే బిన్నీ తెలంగాణకు చెందిన వసంత (28)ని ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నాడు. గత 10 ఏళ్లుగా భర్త, అత్తమామలు, తోడికోడళ్ళతో కలిసి వసంత కొరిశపాడులోనే ఉంటుంది. అయితే కుటుంబ కలహాల కారణంగా మంగళవారం రాత్రి వసంత గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మరణించినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అన్నారు.
Similar News
News April 24, 2025
నిర్మల్: ‘చెక్‌బౌన్స్ కేసులను పరిష్కరించుకోవాలి’

చెక్ బౌన్స్ కేసులను రాజీ పద్ధతుల్లో పరిష్కరించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీవాణి అన్నారు. గురువారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి బ్యాంకు అధికారులతో చెక్ బౌన్స్ కేసుల పరిష్కారంపై సమావేశం నిర్వహించారు.జిల్లాలోని బ్యాంకులు, చిట్ ఫండ్స్‌లలో నమోదై, పెండింగ్‌లో ఉన్న చెక్ బౌన్స్ కేసులను పరస్పర రాజీ మార్గాన పరిష్కరించుకోవాలని సూచించారు.
News April 24, 2025
ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష

ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఈ నెల 26న ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన నేపథ్యంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గురువారం బుడగట్లపాలెంలో ఏర్పాట్లను పరిశీలించారు. హెలిపాడ్ ఏర్పాటు, గ్రామ సభ వేదిక నిర్వహణ, భద్రతా ఏర్పాట్లు, ప్రోటోకాల్ విధుల అమలుపై ఎస్పీ కె. వి. మహేశ్వర్ రెడ్డితో కలసి సమీక్ష నిర్వహించారు.
News April 24, 2025
టూరిజం ప్యాకేజీలపై అవగాహన కల్పించాలి: కలెక్టర్

ఎన్టీఆర్ జిల్లాను పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దే క్రమంలో పర్యాటకులకు మధురానుభూతి మిగిల్చేలా రూపొందించిన ప్రత్యేక ప్యాకేజీలపై అవగాహన కల్పించాలని, ఇందుకు సంబంధించి కరపత్రాలను ఆకర్షణీయంగా రూపొందించాలని కలెక్టర్ లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో టూరిజం ప్యాకేజీపై పర్యాటక, ఏపీ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అధికారులతో సమావేశం నిర్వహించారు.