News January 8, 2025

కొరిశపాడు: చికిత్స పొందుతూ బాలుడి మృతి

image

ఉమ్మడి ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలం తిమ్మవరం రోడ్డులోని వాటర్ ట్యాంకు వద్ద నివాసం ఉండే దుర్గారావు కుమారుడు నాగరాజు(2) ఇంటి బయట ఆడుకుంటూ నాలుగో తేదీన ఎలుకల పేస్టు తిన్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు గుంటూరు ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. హాస్పటల్ నుంచి వచ్చిన సమాచారంతో కేసు నమోదు చేశామని మేదరమెట్ల ఎస్ఐ మొహమ్మద్ రఫీ తెలిపారు.

Similar News

News January 24, 2025

ప్రకాశం: ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం

image

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి గుణాత్మక విద్యను అందించటమే ప్రభుత్వ లక్ష్యమని పాఠశాల విద్యా కమిషనర్ విజయరామరాజు అన్నారు. గురువారం ఒంగోలులో జరిగిన ప్రకాశం- నెల్లూరు జిల్లాల విద్యాశాఖ అధికారుల, ఉపాధ్యాయుల శిక్షణ శిబిరంలో ఆయన ప్రసంగించారు. గతంలో ప్రభుత్యం జారీ చేసిన జీవో 117ను మారుస్తూ మార్గదర్శకాలు జారీ చేస్తున్నట్లు కమిషనర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ తమీమ్ అన్సారియా పాల్గొన్నారు.

News January 23, 2025

డిప్యూటీ CMతో బాలినేని భేటీ

image

ప్రకాశం జిల్లా జనసేన పార్టీ నాయకులు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గురువారం మంగళగిరి క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జరిగిన భేటీలో జనసేన పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, వివిధ రాజకీయ అంశాలపై సమాలోచనలు చేయడం జరిగిందని బాలినేని శ్రీనివాసరెడ్డి తెలియజేశారు.

News January 23, 2025

ప్రకాశం: భార్యను చంపి.. కుక్కర్‌లో ఉడకబెట్టాడు

image

రాచర్ల మండలం JP చెరువుకు చెందిన మాధవిని ఆమె భర్త హత్య చేసిన ఘటన HYDలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. ‘13 ఏళ్ల క్రితం మాధవితో గురుమూర్తికి వివాహమైంది. ఇటీవల గొడవపడి భార్య తలపై గట్టిగా కొట్టాడు. దీంతో ఆమె స్పృహ తప్పింది. చనిపోయిందనుకొని మృతదేహాన్ని ముక్కలుముక్కలుగా నరికి కుక్కర్‌లో వేసి ఉడికించాడు. ఎముకలు పొడిచేసి, చెరువులో పడేశాడు. ఆదివారం మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాడు’ అని తెలిపారు.