News February 1, 2025

కొరిశపాడు హైవేపై రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి

image

కొరిశపాడు జాతీయ రహదారి వద్ద శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుమీద వెళుతున్న మహిళను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న హైవే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News November 28, 2025

3,058 పోస్టులు.. దరఖాస్తు గడువు పొడిగింపు

image

రైల్వేలో ఇంటర్ అర్హతతో 3,058 NTPC (UG) పోస్టులకు అప్లై చేయడానికి గడువును పొడిగించారు. దరఖాస్తుకు ఈనెల 27 ఆఖరు తేదీకాగా.. DEC 4వరకు పొడిగించారు. ఫీజు చెల్లించడానికి DEC 6వరకు అవకాశం ఇచ్చారు. దరఖాస్తులో తప్పుల సవరణ DEC 7-16 వరకు చేసుకోవచ్చు. వయసు 18- 30 ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, స్కిల్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.500. SC,ST, PwBD, మహిళలకు రూ.250. www.rrbcdg.gov.in/

News November 28, 2025

వరంగల్: పార్టీ జెండా, కండువాలే అస్త్రాలు

image

పంచాయతీ ఎన్నికల్లో రాజకీయ పార్టీల గుర్తులుండవు. గ్రామపోరులో ఏ గుర్తు ఎవరికి వస్తుందో తెలియని పరిస్థితి. పోటీచేసే అభ్యర్థి తాను ఏ పార్టీకి చెందినవాడో తెలియజేసేది చేతిలో పార్టీ జెండా, కండువాలే. ప్రస్తుతం అధికార కాంగ్రెస్ ఇందిరమ్మ ఇల్లు, చీరల, రేషన్ కార్డుల పంపిణీలను తమ ప్రచార అస్త్రాలుగా చేసుకొని గ్రామాల్లో ముందుకెళ్తున్నాయి. కాంగ్రెస్ వైఫల్యాలే తమకు ప్రచార అస్త్రాలని ప్రత్యర్థి పార్టీలు అంటున్నాయి.

News November 28, 2025

ADB: ఏకగ్రీవాలు చెల్లవు..!

image

సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా ఉమ్మడి జిల్లాలో ఏకగ్రీవ తీర్మానాల జోరు కొనసాగుతోంది. అయితే ఇవి చెల్లుబాటు కావని ఎన్నికల అధికారులు పేర్కొంటున్నారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత, ఉపసంహరణ, నామినేషన్ల తిరస్కరణకు గురైన తర్వాత ఒకరే అభ్యర్థి బరిలో ఉంటే దానిని ఏకగ్రీవంగా ప్రకటిస్తామని చెబుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 10, నిర్మల్ జిల్లాలో 7 వరకు గ్రామాల్లో ఏకగ్రీవ తీర్మానాలు జరిగినట్లు సమాచారం.