News February 1, 2025
కొరిశపాడు హైవేపై రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి

కొరిశపాడు జాతీయ రహదారి వద్ద శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుమీద వెళుతున్న మహిళను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న హైవే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 17, 2025
మహానందీశ్వరుని కళ్యాణం.. LATEST PHOTO

మహానంది శ్రీ గంగా, శ్రీ కామేశ్వరీ దేవి సమేత శ్రీ మహానందీశ్వర స్వామి దంపతులకు ఆదివారం వైభవంగా నిత్య కళ్యాణం నిర్వహించారు. ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వేదపండితులు రవిశంకర్ అవధాని, పండితులు, అర్చకులు అలంకార మండపంలో స్వామి, అమ్మవారి ఉత్సవ మూర్తులను విశేషంగా అలంకరించారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, మాంగళ్య ధారణ, అక్షింతలు సమర్పణ పూజలు శాస్త్రోక్తంగా చేశారు.
News February 17, 2025
చరిత్ర పుటల్లో ఒక పేజీ సంస్కృత కళాశాల: లక్ష్మీ పార్వతి

తెనాలిలోని కెఎల్ఎన్ సంస్కృత కళాశాల చరిత్ర పుటల్లో ఒక పేజీగా నిలుస్తుందని నందమూరి లక్ష్మీపార్వతి అన్నారు. కొత్తపేటలోని పెన్షనర్స్ హాల్లో జరిగిన సంస్కృత కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం ప్రథమ వార్షికోత్సవ సభలో రామాయణ ప్రవచన సుధాకర్ డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు, ఇతర ప్రముఖులతో కలిసి లక్ష్మీపార్వతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మనోరమ సంచిక ఆవిష్కరణ చేశారు. పూర్వ విద్యార్థుల సంఘ సభ్యులకు అభినందనలు తెలిపారు.
News February 17, 2025
ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు: కలెక్టర్

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా సోమవారం జిల్లా, డివిజన్, మండల కార్యాలయాల్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికను జిల్లా అంతటా తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. పీజీఆర్ఎస్ నిర్వహించే తేదీని ప్రకటన ద్వారా తెలియచేస్తామని కలెక్టర్ తెలిపారు. అర్జీదారులు గమనించాలన్నారు.