News May 25, 2024
కొలిక్కిరాని శ్రీధర్ రెడ్డి హత్య కేసు !

పాలమూరులో సంచలనం సృష్టించిన BRS నేత శ్రీధర్ రెడ్డి హత్య జరిగి 56 గంటలు గడుస్తున్నా కేసు కొలిక్కిరాలేదు. హత్యకు దారితీసిన పరిణామాలు, వ్యక్తిగత, రాజకీయ కక్షలు, వివాహేతర సంబంధాలు, భూవివాదాలు, కుటుంబ సభ్యుల మధ్య తగాదాలపై పోలీసులు విచారిస్తున్నారు. వారి కుటుంబాల్లో భూ తగాదాల సమస్య ఉందని, వారిలో వారే ఈ హత్యకు పాల్పడి ఉంటారని భావిస్తోన్నారు. కేసు కొలిక్కి రాకపోవడంతో పోలీసులకు తలనొప్పిగా మారింది.
Similar News
News February 8, 2025
షాద్‌నగర్: 10న అప్రెంటిస్ షిప్ మేళా

షాద్‌నగర్ ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈనెల 10వ తేదీన అప్రెంటిస్ షిప్ మేళాను నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ లక్ష్మణ్ తెలిపారు. ఉదయం 10 గం.లకు కళాశాలలో ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిస్ షిప్ మేళా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. మహబూబ్‌నగర్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఐటీఐ పూర్తి చేసిన విద్యార్థులు పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.
News February 8, 2025
వనపర్తి: చికిత్స పొందుతూ మహిళ మృతి

ఈ నెల 2వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళ చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందింది. పోలీసులు తెలిపిన వివరాలిలా.. జోగులాంబ అమ్మవారిని దర్శించుకుని తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరిన చంద్రమోహన్, లక్ష్మమ్మల కారు కొత్తకోట ముమ్మళ్లపల్లి స్టేజీ వద్ద రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో లక్ష్మమ్మకు తీవ్ర గాయాలు కాగా.. HYDలోని నిమ్స్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం చనిపోయింది. ఈ మేరకు కేసు నమోదైంది.
News February 8, 2025
NGKL: యువకుడి ఆత్మహత్య

తాను ప్రేమించిన యువతి ఇంట్లో తమ పెళ్లికి ఒప్పుకోలేదని ఓ యువకుడు ఆత్మహత్యకి పాల్పడిన ఘటన శుక్రవారం జరిగింది. పోలీసుల వివరాల మేరకు.. NGKL మండలం పెద్దాపూర్‌కి చెందిన యాదగిరి (23) ఓ యువతిని ప్రేమించాడు. వీరి ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవటంతో మనస్తాపానికి గురయ్యాడు. దీంతో ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి అన్న సురేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.