News April 6, 2025
కొలిమిగుండ్లలో పండగ పూట విషాదం

కొలిమిగుండ్ల మండలం నందిపాడు గ్రామంలో శ్రీరామ నవమి రోజు విషాదం నెలకొంది. నందిపాడుకు చెందిన నాగార్జున(16) పదో తరగతి విద్యార్థి బైక్పై తిమ్మనాయినిపేట నుంచి స్వగ్రామానికి వస్తుండగా పొలాల్లో నుంచి దున్నపోతు అడ్డుగా వచ్చి ఢీకొట్టింది. దీంతో నాగార్జున అక్కడికక్కడే మృతి చెందాడు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Similar News
News November 19, 2025
భారత్, బంగ్లాదేశ్ సిరీస్ వాయిదా

భారత్, బంగ్లాదేశ్ మహిళల జట్ల మధ్య డిసెంబర్లో జరగాల్సిన సిరీస్ను బీసీసీఐ వాయిదా వేసింది. రెండు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బంగ్లాతో సిరీస్కు తమకు పర్మిషన్ రాలేదని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. డిసెంబర్లో ప్రత్యామ్నాయ సిరీస్కు ఏర్పాట్లు చేస్తామని వెల్లడించాయి. కాగా షెడ్యూల్లో భాగంగా మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడాల్సి ఉంది.
News November 19, 2025
ఈనెల 23న రాప్తాడుకు వైఎస్ జగన్

ఈనెల 23న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాప్తాడుకు రానున్నారు. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడి కుమార్తె వివాహానికి హాజరు కానున్నారు. ఈ సందర్భంగా హెలిప్యాడ్ స్థలాన్ని అనంతపురం రూరల్ డీఎస్పీ వెంకటేశ్వర్లు మాజీ సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలసిల రఘురాంతో కలిసి పరిశీలించారు. అక్కడ చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లు గురించి చర్చించారు.
News November 19, 2025
దివిసీమ జల ప్రళయానికి 48 ఏళ్లు

AP: దివిసీమ జల ప్రళయానికి నేటితో 48 ఏళ్లు పూర్తయ్యాయి. 1977 నవంబర్ 19న కడలి ఉప్పొంగడంతో ఊళ్లు శవాల దిబ్బలుగా మారాయి. కృష్ణా జిల్లాలోని నాలి, సొర్లగొంది, సంగమేశ్వరం, గుల్లలమోద, హంసలదీవి తదితర ఎన్నో గ్రామాలు తుడిచిపెట్టుకుపోయాయి. ఎంతో మంది జల సమాధి అయ్యారు. అధికారిక లెక్కల ప్రకారం 14 వేల మందికిపైగా చనిపోయారు. ఘటన జరిగిన 3 రోజుల వరకు బాహ్య ప్రపంచానికి ఈ విషయం తెలియకపోవడం అత్యంత బాధాకరం.


