News March 10, 2025

కొలిమిగుండ్ల సీఐపై YCP సంచలన ఆరోపణలు

image

కొలిమిగుండ్ల మండలం చింతలాయపల్లెలో YCP సానుభూతిపరుల చీనీ తోటను టీడీపీ వర్గీయులు జేసీబీతో ధ్వంసం చేయడం, దాడికి పాల్పడటంపై వైసీపీ మండిపడింది. ‘చీనీ తోట సాగు చేసిన భూమిపై కోర్టులో వ్యాజ్యం కొనసాగుతుండగా.. సీఐ రమేశ్ బాబు ఈ కేసులో జోక్యం చేసుకున్నారు. ఆ భూమిని TDP వారికి స్వాధీనం చేయాలంటూ మూడు రోజుల నుంచి సీఐ ఒత్తిడి తెస్తున్నారు’ అంటూ YCP సంచలన ఆరోపణలు చేసింది.

Similar News

News November 21, 2025

మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

<>మెదక్<<>> ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 21 జూనియర్, డిప్లొమా టెక్నీషియన్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. టెన్త్, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు NAC/NTC కలిగినవారు దరఖాస్తు చేసుకోవచ్చు 18- 30 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు రూ.21,000-రూ.23,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్:https://ddpdoo.gov.in/

News November 21, 2025

రంగేస్తున్నారా? ఇవి తెలుసుకోండి

image

గతంలో తెల్ల జుట్టు వస్తేనే రంగేసుకొనేవారు. కానీ ఇప్పుడు ఫ్యాషన్, ట్రెండ్ అంటూ రకరకాల రంగులతో జుట్టు స్వరూపాన్ని మార్చేస్తున్నారు. దీనికి ముందు కొన్ని టిప్స్ పాటించాలంటున్నారు నిపుణులు. చర్మ రంగుని బట్టి జుట్టు రంగును ఎంచుకోవాలి. రంగు మాత్రమె కాదు షేడ్ కూడా చూసుకోవాలి. లేదంటే జుట్టు, మీ అందం చెడిపోతాయి. మొదటిసారి రంగేస్తున్నట్లయితే వీలైనంత వరకు నిపుణులను సంప్రదించడం మంచిది.

News November 21, 2025

మార్గశిరం వచ్చేసింది.. ఈ వ్రతాలు చేస్తున్నారా?

image

విష్ణుమూర్తికి ప్రీతిపాత్రమైన మార్గశిర మాసంలో కొన్ని ముఖ్యమైన వ్రతాలను ఆచరిస్తారు. పెళ్లి కాని అమ్మాయిలు మంచి భర్త రావాలని కాత్యాయనీ వ్రతం చేస్తారు. గురువారాల్లో మార్గశిర లక్ష్మీవార వ్రతాన్ని చేస్తే రుణ సమస్యలు తొలగి, సంపద, ఆరోగ్యం కలుగుతాయని నమ్మకం. మనోధైర్యం, ధృడ సంకల్పం, దుష్ట గ్రహాల ప్రభావం నుంచి రక్షణ కోసం హనుమద్వ్రతం చేస్తారు. ☞ ఏ వ్రతం ఎప్పుడు, ఎలా చేయాలో తెలుసుకోవడానికి <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.