News February 17, 2025
కొల్చారం: బైక్, ఆర్టీసీ బస్సు ఢీ.. యువకుడి మృతి

కొల్చారం శివారులో అదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందాడు. ఆర్టీసీ బస్సు, ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. దీంతో బైక్ పై ఉన్న కౌడిపల్లి మండలం కన్నారం గ్రామానికి చెందిన రాజేందర్(27) అక్కడికక్కడే మృతి చెందారు. మెదక్ నుంచి తన స్వగ్రామం కన్నారం వెళ్తుండగా ఈ ప్రమాదానికి గురయ్యాడు.
Similar News
News November 15, 2025
మెదక్: నేడు జిల్లాలో కవిత పర్యటన ఇదే

మెదక్ జిల్లాలో రెండవ రోజు శనివారం కల్వకుంట్ల కవిత జాగృతి జనం బాట షెడ్యూల్ ఈవిధంగా ఉంది. హవేలి ఘన్పూర్ మండలం కూచన పల్లిలో పాడి రైతులతో సమావేశం
2.రమేష్ కుటుంబ సభ్యుల పరామర్శ,
3.మెదక్‌లో ప్రెస్ మీట్,
4.మేధావులతో సమావేశం, బూరుగుపల్లి, రాజుపేట, వాడి, దూప్ సింగ్ తండాలో వరద బాధితుల పరామర్శ, 5.పొలంపల్లిలో కేవల్ కిషన్, చిన్నశంకరంపేట అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పిస్తారు.
News November 14, 2025
17న ఉమ్మడి మెదక్ జిల్లా ఎంపికలు

ఉమ్మడి మెదక్ జిల్లా టేబుల్ టెన్నిస్ మహిళలు, పురుషులు, 19 సంవత్సరాల లోపు బాల, బాలికలు క్రీడాకారుల ఎంపిక ఈ నెల 17న మెదక్ గుల్షన్ క్లబ్లో నిర్వహిస్తున్నట్లు కార్యదర్శి డాక్టర్ కె.ప్రభు తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు ఉదయం 10 గంటలకు మెదక్ బస్ డిపో వద్ద గల గుల్షన్ క్లబ్లో ఆధార్ కార్డు లేదా జనన ధ్రువీకరణ పత్రంతో హాజరు కావాలని సూచించారు. వివరాలకు 94404 90622 సంప్రదించాలన్నారు.
News November 14, 2025
మెదక్: ‘టెట్ పరీక్ష మినహాయింపు ఇవ్వాలి’

ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ పరీక్ష మినహాయింపు కోసం కేంద్ర విద్యాశాఖ మంత్రి ద్వారా ప్రభుత్వాన్ని ఒప్పించాలని
మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావును జిల్లా PRTU TS అధ్యక్ష్య, ప్రధాన కార్యదర్శులు మేడి సతీష్ రావు, సామ్యా నాయక్, గౌరవాధ్యక్షులు సబ్బని శ్రీనివాస్ ఆధ్వర్యంలో విజ్ఞప్తి చేశారు. ఎంపీ మాట్లాడుతూ.. కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో చర్చించనున్నట్లు హామీ ఇచ్చారు.


