News September 10, 2024
కొల్లాంకు కడప మీదుగా ప్రత్యేక రైలు
ఓనం పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్ట్యా కాచిగూడ-కొల్లాం-కాచిగూడ రైలును కడప మీదుగా నడుపుతున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. కాచిగూడ నుంచి 14వ తేదీ సాయంత్రం రైలు బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున 12.38కు కడపకు కి చేరుకొని రేణిగుంట, కాట్పడి, త్రిశూర్, ఎర్నాకులం మీదుగా కొల్లాం చేరుకుంటుందని ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Similar News
News October 11, 2024
కడప జిల్లా ప్రజలకు ఎస్పీ దసరా శుభాకాంక్షలు
విజయదశమి పర్వదిన సందర్బంగా జిల్లా ప్రజలకు, పోలీస్ సిబ్బందికి, మీడియా మిత్రులకు ఎస్పీ వీ.హర్షవర్ధన్ రాజు శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా జరుపుకునే విజయదశమి వేడుకను ప్రతి ఒక్కరూ సంతోషంతో జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజలకు అమ్మవారి అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని, అన్ని వర్గాల వారు నిత్యం సంతోషంగా ఉండాలని అభిలాషించారు.
News October 11, 2024
కడప జిల్లా కలెక్టర్ బదిలీ
కడప కలెక్టర్ శివశంకర్‌ను తెలంగాణ రాష్ట్రానికి కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్ర, తెలంగాణ క్యాడర్ విభజనపై కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర విభజన సమయంలో అధికారులను ఏపీ, తెలంగాణకు కేంద్రం సర్దుబాటు చేసింది. తెలంగాణ క్యాడర్‌కు చెందిన కడప కలెక్టర్ శివశంకర్‌ను తిరిగి ఆ రాష్ట్రానికి కేటాయించారు. ఈ నెల 16లోపు రిపోర్ట్ చేయాలని పేర్కొంది.
News October 11, 2024
కడప: ‘అధికారుల దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించాలి’
గ్రామోదయం, నగరోదయం కార్యక్రమాలలో అధికారుల దృష్టికి వచ్చిన సమస్యలను వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ శివ శంకర్ లోతేటి అధికారులను ఆదేశించారు. కలెక్టర్లతో గురువారం క్షేత్రస్థాయి అధికారులలో ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతి అర్జీని పరిష్కరించినప్పుడే గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాలు ఏర్పడతాయని, అభివృద్ధి చెందుతాయని ఆయన పేర్కొన్నారు.