News March 19, 2024
కొల్లాపూర్: మంచంపైనే పరీక్ష రాసిన విద్యార్థి

కొల్లాపూర్ మండలంలోని ఎల్లూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థి సాంబశివుడికి నెల కిందట ప్రమాదంలో కాలు విరిగింది. సోమవారం కుమారుడు తెలుగు పరీక్ష రాసేందుకు తల్లిదండ్రులు బయ్యన్న, సుజాత మరో సహాయకుడితో మంచంతో సహా ఆటోలో కొల్లాపూర్ లోని పరీక్ష కేంద్రానికి తరలించారు. ముందస్తు అనుమతితో సాంబశివుడిని మంచంపైనే కూర్చొని పరీక్ష రాయించినట్లు తల్లిదండ్రులు పేర్కొన్నారు.
Similar News
News April 8, 2025
పాలమూరులో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ!

పాలమూరు యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వర్సిటీలో మొత్తం 58మంజూరు పోస్టులకు గాను 16 మంది మాత్రమే పని చేస్తున్నారు. ఇంకా 42ఖాళీలు ఉన్నాయి. అకడమిక్ రికార్డ్, పరిశోధనలు, విషయ పరిజ్ఞానం, బోధన నైపుణ్యం, ఇంటర్వ్యూ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. కాగా ఈ పోస్టుల్లో ఎన్ని భర్తీ చేస్తారనే విషయాన్ని ప్రభుత్వం ఇంకా వెల్లడించలేదు.
News April 8, 2025
MBNR: ఎరుకల సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్కు వినతి

ఎరుకల సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయిని కలిసి ఎరుకల సంఘం సభ్యులు సోమవారం వినతిపత్రం సమర్పించారు. రాష్ట్ర అధ్యక్షుడు ఎల్సరి కృష్ణయ్య మాట్లాడుతూ.. పేద ఎరుకలకు విద్య, వైద్యం, సీసీ రోడ్లు, ఉపాధి, మౌలిక వసతులు కల్పించి వారి సంక్షేమానికి కృషి చేయాలని వారు కోరారు. పందుల పెంపకం దారులకు ప్రత్యామ్నాయ ఉపాధి, గిరిజన రుణాలు, రుణమాఫీ, సంక్షేమ పథకాలు అమలు కావాలన్నారు.
News April 8, 2025
నారాయణపేట: హత్య కేసులో నేరస్థుడికి జైలు శిక్ష

హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చిందని నారాయణపేట ఎస్పీ యోగేశ్గౌతమ్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు.. వింజమూరు వాసి జోగువెంకట్ రాములు కొత్తపల్లి(M) తిమ్మారెడ్డిపల్లి వాసి కృష్ణవేణిపై అత్యాచారానికి యత్నించి నిప్పంటించి చంపేశాడు. ఈకేసులో ముద్దాయికి సోమవారం జిల్లా జడ్జి అబ్దుల్ రఫీ శిక్ష విధించారు. 2022 FEB 15న బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేశామన్నారు.