News April 15, 2025
కొల్లాపూర్: ‘స్థానిక ఎన్నికల్లో BRS గెలుపు ఖాయం’

మాజీ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో నిర్వహించే రజతోత్సవ సభతో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో BRS అభ్యర్థులు గెలవడం ఖాయమని మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈనెల 27న వరంగల్లో నిర్వహించే BRS సభ పోస్టర్లను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. పాలనలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు విశ్వాసం కోల్పోయారన్నారు. భారీ సంఖ్యలో తరలివచ్చి సభను జయప్రదం చేయాలని హర్షవర్ధన్ రెడ్డి పిలుపునిచ్చారు.
Similar News
News November 20, 2025
బాలలకు విద్యాపరమైన సౌకర్యాలు కల్పించాలి: ఎస్పీ

బాలుర వసతి గృహాల్లో ఉన్న బాలలకు విద్యాపరమైన సౌకర్యాలు కల్పించాలని జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ అన్నారు. బాలల దినోత్సవ వారోత్సవాలను పురస్కరించుకొని ఏలూరు శనివారపుపేటలో ఉన్న బాలుర వసతి గృహంలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఎస్పీ నిర్వహించారు. అక్కడ ఉన్న 51 మంది బాలురకు పలు ఆటల పోటీలు నిర్వహించారు. అనంతరం వారికి ఎస్పీ బహుమతులను అందజేశారు. వారితో కలిసి ఫోటోలు కూడా దిగారు. ఎస్పీ రాకతో బాలురు సంతోషించారు.
News November 20, 2025
HYD: మెట్రోలో వారి కోసం ప్రత్యేక స్కానింగ్

మెట్రోలో భద్రత మా ప్రాధాన్యం అని HYD మెట్రో తెలిపింది. ప్రతి స్టేషన్లో ఆధునిక సీసీటీవీ నిఘా, కఠిన భద్రతా తనిఖీలు అమలు చేస్తూ ప్రయాణికుల రక్షణను మరింత బలపరుస్తున్నట్లు తెలిపింది. ఫేస్మేకర్లు, గుండె రోగులు, గర్భిణీలకు పూర్తిగా సురక్షితమైన స్కానర్లు ఏర్పాటు చేయడం మెట్రో భద్రతా ప్రమాణాలకు నిదర్శనంగా పేర్కొంది.
News November 20, 2025
తిరుమల: వేగంగా ఫుడ్ ల్యాబ్ పనులు

భక్తులకు నాణ్యమైన ఆహారం అందించే దిశగా తిరుమలలో స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.19.84 కోట్లు విడుదల చేసింది. ల్యాబ్ యంత్రాలు ఇప్పటికే తిరుమలకు చేరుకున్నాయి. ఇందుకు సంబంధించిన పనులు శరవేగంగా సాగుతున్నాయి. డిసెంబర్ నెలలో ల్యాబ్ ప్రారంభించేలా పనులు చేస్తున్నారు.


