News February 12, 2025

కొల్లిపరలో భారీ కొండ చిలువ 

image

కొల్లిపర మండలం పిడపర్తిపాలెంలో బుధవారం భారీ కొండచిలువ కలకలం రేపింది. గ్రామానికి చెందిన రైతు ఆదాము ఉదయం పనుల నిమిత్తం పొలానికి వెళ్లాడు. ఈ సమయంలో నిమ్మతోటలో భారీ కొండ చిలువ కనిపించడంతో భయాందోళనకు గురయ్యాడు. ఊర్లోకి వెళ్లి గ్రామస్థులను తీసుకువచ్చి కొండ చిలువను పట్టుకొని కృష్ణానది పరీవాహక ప్రాంతంలో వదిలారు. తరచూ గ్రామంలో, పొలాల్లో కొండ చిలువలు కనిపిస్తుండటంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. 

Similar News

News January 1, 2026

GNT: అల్లర్లు లేవు.. పోలీసుల పక్కా ప్లాన్ సక్సెస్.!

image

నూతన సంవత్సర వేడుకలతో గుంటూరు జిల్లా సందడిగా మారింది. పూలబొకేలు, స్వీట్స్, కేకుల విక్రయాలు జోరుగా సాగాయి. ఇళ్ల ముందు రంగురంగుల రంగవల్లులతో మహిళలు, యువతులు సందడి చేశారు. అర్ధరాత్రి నుంచే యువత శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఉత్సాహంగా పాల్గొన్నారు. కాగా యువత కొద్దిగా ఇంటికే పరిమితమయ్యారు. ఎస్పీ ఆదేశాల మేరకు శాంతియుత వాతావరణంలో వేడుకలు జరిగేలా గుంటూరు జిల్లా పోలీసుల చర్యలు ప్రశంసలు అందుకుంటున్నాయి.

News December 31, 2025

GNT: SC, ST విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడిగా కంతేటి

image

గుంటూరు జిల్లా SC,ST విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడిగా కంతేటి బ్రహ్మయ్యను ఎంపిక చేశారు. ఈ మేరకు గుంటూరు జిల్లా కమిటీకి సభ్యుడుగా నియమించిన గుంటూరు కలెక్టర్ తమీమ్ అన్సారీయాకు బ్రహ్మయ్య కృతజ్ఞతలు తెలిపారు. ఎస్సీ, ఎస్టీల రక్షణ కోసం 1989లో ఏర్పాటు చేసిన చట్టాన్ని ఎవరైనా దుర్వినియోగపరిస్తే అలాంటి వారిపై చర్యలు తీసుకునేందుకు తన వంతు కృషి చేస్తానని వెల్లడించారు.

News December 31, 2025

గుంటూరులో పడిపోయిన గాలి నాణ్యత

image

గుంటూరులో గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. మంగళవారం AQI.in నివేదిక ప్రకారం, నగరంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 229గా నమోదైంది. ఇది ‘సివియర్’ కేటగిరీ కిందకు వస్తుంది. గుంటూరుతో పాటు పరిసర ప్రాంతాలైన తెనాలి, బాపట్ల వైపు కూడా కాలుష్యం తీవ్రత ఎక్కువగా ఉంది. నగరంలోని పలు ప్రాంతాల్లో AQI 212 నుంచి 243 మధ్య నమోదైంది. చలి తీవ్రత పెరగడం, వాహనాల కాలుష్యం కారణంగా గాలి నాణ్యత దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.