News February 12, 2025

కొల్లిపరలో భారీ కొండ చిలువ 

image

కొల్లిపర మండలం పిడపర్తిపాలెంలో బుధవారం భారీ కొండచిలువ కలకలం రేపింది. గ్రామానికి చెందిన రైతు ఆదాము ఉదయం పనుల నిమిత్తం పొలానికి వెళ్లాడు. ఈ సమయంలో నిమ్మతోటలో భారీ కొండ చిలువ కనిపించడంతో భయాందోళనకు గురయ్యాడు. ఊర్లోకి వెళ్లి గ్రామస్థులను తీసుకువచ్చి కొండ చిలువను పట్టుకొని కృష్ణానది పరీవాహక ప్రాంతంలో వదిలారు. తరచూ గ్రామంలో, పొలాల్లో కొండ చిలువలు కనిపిస్తుండటంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. 

Similar News

News March 27, 2025

గుంటూరు జిల్లాలో గెలిచిన వారి వివరాలు

image

గుంటూరు జిల్లాలోని పలు మండలాల్లో గురువారం నిర్వహించిన ఉప ఎన్నికలు ముగిశాయి. పొన్నూరు మండలం బ్రాహ్మణకోడూరు (TDP) ఉప సర్పంచ్‌గా నాగమల్లేశ్వరరావు గెలుపొందారు. గుంటూరు రూరల్ మండల ఉపాధ్యకుడిగా కాకాని రమేష్(YCP), దుగ్గిరాల మండల పరిషత్ అధ్యక్షురాలిగా షేక్ జబీన్(TDP), తెనాలి కోఆప్షన్ సభ్యుడిగా సయ్యద్ జానీ బాషా(YCP), కొల్లిపర మండలం (YCP) తూములూరు ఉప సర్పంచ్‌గా ఆరుమళ్ల శివారెడ్డి ఎన్నికయ్యారు.

News March 27, 2025

గుంటూరు: సీఎం చంద్రబాబుకు నాదెండ్ల స్వాగతం

image

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను గురువారం పరిశీలన చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ పోలవరం చేరుకుని ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి మంత్రి నాదెండ్ల ప్రాజెక్టు గురించి పలు విషయాలు వివరించారు. అనంతరం నిర్వాశితులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు.

News March 27, 2025

ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా 

image

మాజీ మంత్రి విడదల రజిని ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. విచారణను ఏప్రిల్ 2వ తేదీకి ఏపీ హైకోర్టు వాయిదా వేసింది. ఈ మేరకు గురువారం హైకోర్టులో వాదనలు జరిగాయి. కాగా ఏసీబీ అధికారులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్‌కు మాజీ మంత్రి పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. 

error: Content is protected !!