News March 13, 2025
కొల్లూరు: లారీ బోల్తా

కంకర పోసుకుని వెళుతున్న లారీ బోల్తా పడిన ఘటన కొల్లూరు మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. కొల్లూరుకు చెందిన లారీ గుంటూరు నుంచి కంకర లోడ్‌తో గురువారం తెల్లవారుజామున వెళుతుండగా సిమెంట్ రోడ్డు ఒక్కసారిగా ధ్వంసమైంది. దీంతో లోడ్‌తో వెళ్తున్న లారీ బోల్తా పడిందని అన్నారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు అని స్థానికులు తెలిపారు.
Similar News
News March 15, 2025
KMR: నేటి నుంచి ఒంటి పూట బడులు

జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి ఒంటి పూట బడులు ప్రారంభం కానున్నాయి. ఉదయం 8 గంటల నుంచి 12:30 వరకు మాత్రమే స్కూలు ఉంటుంది. ఈ నెలలో పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తున్న జిల్లా పరిషత్ హై స్కూల్లో పరీక్షలైన అనంతరం ఒంటి గంట నుంచి 5 గంటల వరకు స్కూలు ఉంటుంది. వేసవి సందర్భంగా మధ్యాహ్నం వరకే క్లాసులు నిర్వహించనున్నారు.
News March 15, 2025
కౌటాల: గ్రూప్-2లో 191, గ్రూప్-3లో 349వ ర్యాంకు

ఆసిఫాబాద్ జిల్లా కౌటాలకి చెందిన <<15731264>>సాయిరాం గౌడ్ గ్రూప్-2, గ్రూప్-3 ఫలితాల్లో<<>> సత్తా చాటాడు. నిన్న విడుదలైన గ్రూప్-3 ఫలితాల్లో 349వ ర్యాంక్ సాధించి పలువురికి ఆదర్శంగా నిలిచాడు. అంతకుముందు విడుదలైన గ్రూప్- 2 ఫలితాల్లో 191వ ర్యాంకు సాధించాడు. గ్రూప్- 4లో జూనియర్ అసిస్టెంట్, గ్రూప్ -1 మెయిన్స్‌లోను 436 మార్కులతో సాధించాడు. ప్రస్తుతం బెజ్జూరు మండలం మొగవెల్లి JPS విధులు నిర్వహిస్తున్నారు.
News March 15, 2025
అనకాపల్లి: ‘చీరకు దీపం అంటుకుని మృతి’

అనకాపల్లి దాడివారి వీధిలోని ఓ ఇంట్లో అగ్ని ప్రమాదానికి గురైన వృద్ధురాలు కేజీహెచ్లో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. దీనికి సంబంధించి పట్టణ సీఐ విజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. భీశెట్టి జోగరత్నం ఈ నెల 10న పూజ చేస్తున్న సమయంలో చీరకు దీపం అంటుకుని అగ్నిప్రమాదానికి గురైంది. చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలించగా మృతి చెందింది. ఈమె భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.