News December 29, 2024
కొల్లేరుపై నిర్వహించిన లిడార్ సర్వేపై ఏలూరు కలెక్టర్ సమీక్ష
కొల్లేరుపై 2022-23లో నిర్వహించిన లిడార్ సర్వే పూర్తవడంతో దానిపై శనివారం శాఖల అధికారులతో ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రీసెల్వి సమీక్ష నిర్వహించారు. గ్రౌండ్ ట్రూ థింగ్ కోసం అటవీ శాఖ అధికారులు ప్రతిపాదించిన అంశాలపై చర్చించారు. శాస్త్రీయబద్ధంగా ఉండేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డి, లిడార్ సర్వే ఏజెన్సీ ప్రతినిధులు, అటవీ శాఖ, ఇరిగేషన్ శాఖ అధికారులు పాల్గొన్నారు.
Similar News
News January 4, 2025
1,123 ఎకరాల్లో తాడేపల్లిగూడెంలో ఎయిర్‌పోర్ట్..!
ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి రాజమండ్రిలో ఓ ఎయిర్‌పోర్ట్ ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ప.గో జిల్లాలోనూ విమానాశ్రయం రానుంది. ఈ మేరకు సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. తాడేపల్లిగూడెంలో ఎయిర్‌పోర్ట్ నిర్మించాలనే ఆలోచన తమ ప్రభుత్వానికి ఉందన్నారు. దాదాపు 1,123 ఎకరాల్లో ఎయిర్‌పోర్ట్ నిర్మించేలా ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. అన్నీ కుదిరితే త్వరలోనే ఎయిర్‌పోర్టు పనులపై ముందడుగు పడే అవకాశం ఉంది.
News January 4, 2025
ప.గో: మంత్రి నాదెండ్లను కలిసిన దుర్గేశ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ను రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందల దుర్గేష్ శుక్రవారం ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నాదెండ్లకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఇరువురు పలు శాఖా పరమైన అంశాలు చర్చించినట్లు తెలిపారు.
News January 3, 2025
ప.గో: ఎకో-సెన్సిటివ్ జోన్ ఖరారుపై గ్రామసభలు
ఆకివీడు, ఉండి, పెంటపాడు, గణపవరం, కాళ్ల మండలాలలో ఎకో-సెన్సిటివ్ జోన్ ఖరారుపై జనవరి 6న గ్రామ సభలను నిర్వహించనున్నట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. కొల్లేరు అభయారణ్యం చుట్టు ప్రక్కల ఎకో-సెన్సిటివ్ జోన్ ఖరారు చేయడంపై స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద ఈ సమావేశాలు ఉంటాయన్నారు. ఆయా మండలాలకు సంబంధించి కొల్లేరు పరిధిలోని ప్రజలు గ్రామసభలకు హాజరై అభిప్రాయాలను తెలియజేయాలని కోరారు.