News December 29, 2024
కొల్లేరుపై నిర్వహించిన లిడార్ సర్వేపై ఏలూరు కలెక్టర్ సమీక్ష
కొల్లేరుపై 2022-23లో నిర్వహించిన లిడార్ సర్వే పూర్తవడంతో దానిపై శనివారం శాఖల అధికారులతో ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రీసెల్వి సమీక్ష నిర్వహించారు. గ్రౌండ్ ట్రూ థింగ్ కోసం అటవీ శాఖ అధికారులు ప్రతిపాదించిన అంశాలపై చర్చించారు. శాస్త్రీయబద్ధంగా ఉండేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డి, లిడార్ సర్వే ఏజెన్సీ ప్రతినిధులు, అటవీ శాఖ, ఇరిగేషన్ శాఖ అధికారులు పాల్గొన్నారు.
Similar News
News January 18, 2025
అభివృద్ధిపై దృష్టిసారించాలి: కలెక్టర్
ఏలూరు జిల్లాలో ఉద్యాన పంటలు విస్తరణ, ఆక్వారంగం, పాడిపరిశ్రమ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఏలూరు కలెక్టరేట్‌లో స్వర్ణాంధ్ర 2047లో భాగంగా రానున్న ఐదేళ్లలో లక్ష్యాల అమలు, ప్రగతిపై నిర్ధేశించిన కీ ఫెర్ఫార్మెన్స్ ఇండికేటర్ పై సంబంధిత అధికారులతో సమీక్ష చేశారు.
News January 17, 2025
ఏలూరులో ఈనెల 22 జాబ్ మేళా
ఈనెల 22న ఏలూరులో జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి మధు భూషణరావు శుక్రవారం తెలిపారు. ఆరోజు ఉదయం 9.30 గంటలకు జాబ్ మేళా ప్రారంభమవుతుందన్నారు. తిరుపతిలో ఉన్న పశ్చిమ ఆసియాలో అతి పెద్ద క్యాడ్బరీ చాక్‌లెట్ తయారీ కంపెనీ ప్రతినిధులు ఇంటర్వ్యూ చేస్తారన్నారు. నిరుద్యోగ యువతీ, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News January 17, 2025
జిల్లాలో ప్రతి 3వ శనివారం స్వచ్ఛ దివాస్
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో జిల్లాలో ప్రతి మూడో శనివారం ‘స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివాస్” కార్యక్రమాన్ని నిర్వహించేందుకు చర్యలు చేపట్టడమైందని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ లో సమావేశం మందిరంలో జిల్లా అధికారులతో కలెక్టర్ సమావేశమయ్యారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు తగిన సూచనలు చేశారు.