News August 4, 2024
కొవిడ్ కాల నష్ట నివారణపై ప్రశ్నించిన MP మాగుంట

దేశంలో కొవిడ్-19 వ్యాప్తి వల్ల ఏర్పడిన ఆర్థిక నష్టాల గురించి ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి పార్లమెంట్లో ప్రశ్నించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి పంకజ్ చౌదరి సమాధానమిస్తూ.. రాష్ట్రాలలోని రేషన్ కార్డుల క్రింద ఒక్కో వ్యక్తికి 5 కేజీల ఉచిత ఆహార ధాన్యాలు కొనసాగింపు, మొదలగు కార్యక్రమాలతో నష్ట నివారణ జరిగిందన్నారు.
Similar News
News December 12, 2025
ఒంగోలు: పెళ్లి పేరుతో మోసం.. పదేళ్ల జైలుశిక్ష

పెళ్లి చేసుకుంటానని యువతిని నమ్మించి మోసం చేసిన కేసులో నిందితుడికి పదేళ్ల జైలుశిక్ష, రూ.12వేల జరిమానా విధిస్తూ ఒంగోలు 2వఅదనపు జిల్లా సెషన్స్ జడ్జి శుక్రవారం తీర్పునిచ్చారు. హెచ్ఎంపాడు మండలానికి చెందిన రవి ఓ యువతిని నమ్మించి మోసం చేసినట్లుగా 2018లో కేసు నమోదైంది. నేరం రుజువు కావడంతో రవికి శిక్ష విధిస్తూ జడ్జి తీర్పునిచ్చారు. సరైన సాక్ష్యాధారాలు ప్రవేశపెట్టిన పోలీసులను ఎస్పీ అభినందించారు.
News December 12, 2025
ఒంగోలు రిమ్స్ ఆసుపత్రిలో రూ.10 కోట్లతో పనులు

ఒంగోలు రిమ్స్ వైద్యశాల అభివృద్ధికి సుమారు రూ.10 కోట్లు ఖర్చు చేయనున్నట్లు కలెక్టర్ రాజబాబు వెల్లడించారు. ఆసుపత్రిని ఆయన శుక్రవారం సందర్శించారు. రోగులకు అందించాల్సిన వైద్య సేవలపై ఆరా తీశారు. రోగులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
News December 12, 2025
ప్రకాశం జిల్లాలో భార్యాభర్తలు సూసైడ్.!

ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం సంజీవరాయునిపేట సమీపంలోని అటవీ ప్రాంతంలో భార్యాభర్తలు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దంతరపల్లికి చెందిన ఈ దంపతులు 5 నెలలక్రితం అదృశ్యమయ్యారు. అప్పుల బాధతో ఇంటి నుంచి వెళ్లిపోయిన వీరు ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


