News October 9, 2024
కొవ్వాడ ఆర్ అండ్ ఆర్ పనులు వేగవంతం చేయాలి

కొవ్వాడ అణు విద్యుత్ ప్రాజెక్టు నిర్వాసితుల కోసం ధర్మవరం వద్ద నిర్మిస్తున్న ఆర్ అండ్ ఆర్ కాలనీలో అప్రోచ్ రోడ్డు నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ ఆహ్మద్‌తో కలిసి సంబంధిత అధికారులతో బుధవారం ఆయన తన కార్యాలయంలో సమావేశమయ్యారు. అప్రోచ్ రోడ్డు పెండింగ్ పనులపై, నిర్వాసితులకు చెల్లించాల్సిన పెండింగ్ నష్ట పరిహారాలపై చర్చించారు.
Similar News
News December 4, 2025
మూలపేట పొర్టు నిర్మాణంపై అప్‌డేట్

టెక్కలి నియోజకవర్గం మూలపేట పోర్టు నిర్మాణం జాప్యం అవుతోంది. దీని వ్యవధిని 2026 నవంబర్‌కు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సుమారు రూ. 2949.70 కోట్లతో విశ్వసముద్ర పోర్టు కాంట్రాక్ట్ సంస్థ పనులను 2023 ఏప్రిల్‌లో ప్రారంభించింది. కాంట్రాక్టర్ గడువు ఈ ఏడాది అక్టోబర్ 17తో ముగిసింది. పెండింగ్ పనుల దృష్ట్యా కట్టడాల కాలపరిమితిని పెంచుతూ తాజాగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
News December 4, 2025
ఎచ్చెర్ల: రిజల్ట్స్ వచ్చాయి

ఎచ్చెర్ల డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ LLB 2, 4, 6, 8, 10వ సెమిస్టర్ల పరీక్షల రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈమేరకు యూనివర్సిటీ ఎగ్జామినేషన్స్ డీన్ ఉదయ్ భాస్కర్ బుధవారం సాయంత్రం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ రిజల్ట్స్‌ను అధికారిక వెబ్ సైట్ https://brau.edu.in/లో పొందుపరిచామన్నారు. 95 మందికి 84 మంది ఉత్తీర్ణత సాధించారని తెలిపారు.
News December 4, 2025
గర్భస్థ లింగ నిర్ధారణ చట్టరీత్యా నేరం: DM&HO

గర్భస్థ శిశు లింగ నిర్ధారణ చట్టరీత్యా నేరమని DM &HO అనిత స్పష్టం చేశారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో బుధవారం లింగ ఆధారిత హింస నివారణ, మెడికో లీగల్ కేర్‌పై శిక్షణ కార్యక్రమం జరిగింది. గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. సమాజంలో ఆడపిల్లలపై జరుగుతున్న హింసలను అరికట్టి, లింగ వివక్ష చూపరాదని డీఎంహెచ్వో తెలియజేశారు.


