News April 8, 2024

కొవ్వూరులో అనుమతులు లేని ప్రచార వాహనం సీజ్

image

ఎన్నికల నిబంధనల ప్రకారం ముందస్తు అనుమతి తీసుకోకుండా ప్రచార చేస్తున్న ఓ వాహనాన్ని కొవ్వూరు పోలీసులు సోమవారం సాయంత్రం సీజ్ చేశారు. కొవ్వూరులో ఓ పార్టీ నాయకులు అనుమతి తీసుకోకుండా ప్రచార వాహనాన్ని కాలనీల్లో తిప్పుతున్నారు. తనిఖీలు చేస్తున్న అధికారులు అనుమతిపత్రాలు అడగగా.. అవి లేకపోవడం సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. వాహనంతో పాటు సౌండ్ బాక్స్‌లను సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Similar News

News April 4, 2025

జీలుగుమిల్లి: శోకసముద్రంలో అంజలి కుటుంబ సభ్యులు

image

రాజమండ్రిలో ఆత్మహత్యాయత్నం చేసిన ఉమ్మడి ప.గో(D) జీలుగుమిల్లి మండలానికి చెందిన ఫార్మసీ విద్యార్థి నల్లపు అంజలి శుక్రవారం ఉదయం చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో ఆమె స్వగ్రామం రౌతుగూడెంలో విషాదఛాయలు నెలకొన్నాయి. మరికాసేట్లో ఆమె భౌతికకాయాన్ని గ్రామానికి తీసుకురానున్నారు. కుమార్తె మృతితో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. అంజలి ఆత్మహత్యకి కారణమైన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.

News April 4, 2025

ఏలూరు: నకిలీ పోలీసులు అరెస్టు

image

సినీ ఫక్కీలో పోలీసులమని చెప్పుకుంటూ భీమడోలు పరిసర ప్రాంతాలలో దుకాణదారుల నుంచి అక్రమంగా నగదు వసూలు చేస్తున్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ సూర్యచంద్రరావు మీడియాకు వివరాలు తెలిపారు. వీరంతా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారనే ఫిర్యాదులతో నిఘా పెట్టి అరెస్ట్ చేశామన్నారు. కేసుని ఛేదించిన భీమడోలు సీఐ యూజే విల్సన్, ద్వారకాతిరుమల ఎస్ఐ సుధీర్‌లను అభినందించారు.

News April 4, 2025

ఆక్వా రైతులపై మరో పిడుగు

image

సీడ్, ఫీడ్ ధరల పెంపుతో ఇప్పటికే అల్లాడుతున్న ఆక్వా రైతులపై మరో పిడుగు పడింది. భారత ఉత్పత్తులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 26% పన్నులు విధిస్తామని చెప్పడం ఆక్వా రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. జిల్లా నుంచి అమెరికా, ఇతర దేశాలకు రొయ్యలు ఎగుమతి అవుతాయి. ఇదే అదునుగా ఎగుమతిదారులు కౌంట్‌ను బట్టి రూ.20 నుంచి రూ.30 వరకు రేట్లు తగ్గించేశారని రైతులు లబోదిబోమంటున్నారు. ఇలా అయితే సాగు చేయలేమంటున్నారు.

error: Content is protected !!