News February 13, 2025
కొవ్వూరులో హీరో రామ్ సినిమా షూటింగ్

సినీ హీరో రామ్ పోతినేని 22వ సినిమా షూటింగ్ తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం ఆరికిరేవుల గ్రామంలో జరిగింది. మైత్రీ మూవీస్ బ్యానర్‌లో నిర్మిస్తున్న ఈ సినిమాకు ఇంకా పేరు పెట్టలేదు. మంగళవారం ఆరికిరేవుల స్నానఘట్టం, గోదావరి నది వద్ద సన్నివేశాలను చిత్రీకరించారు. మహేష్‌బాబు.పి దర్శకత్వం వహిస్తుండగా హీరోయిన్‌గా భాగ్యశ్రీ ,రావు రమేష్, బ్రహ్మానందం, హర్షవర్దన్‌లు నటిస్తున్నారని చిత్ర యూనిట్ తెలిపింది.
Similar News
News March 22, 2025
రాజానగరం: సేద్యపు నీటి కుంటను ప్రారంభించిన కలెక్టర్

మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం (NREGS)ద్వారా సేద్యపు నీటి కుంటను జిల్లా కలెక్టర్ ప్రశాంతి కొబ్బరికాయ కొట్టి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. తోకాడ గ్రామం నుంచే మొట్టమొదటిగా ఇంకుడు గుంట కార్యక్రమాన్ని ప్రారంభించామని ఆమె అన్నారు. జిల్లాలో ప్రతి ఒక్కరూ ప్రకృతి వనరులైన నీటిని ఒడిసిపెట్టి, దాచి నట్లయితే రాబోయే తరాలవారికి మంచి తాగునీటిని అందించగలమని అన్నారు.
News March 22, 2025
IPL: కాకినాడ కుర్రాడిపైనే దృష్టంతా!

మరికొన్ని గంటల్లో ఐపీఎల్ ప్రారంభమవుతుంది. మామిడికుదురు(M) గోకులమఠంలో పుట్టిన సత్యనారాయణరాజు ఐపీఎల్‌లో MI తరఫున ఆడుతున్నాడు. గోదావరి జిల్లాల ప్రజల చూపు ఇప్పుడు అతడిపైనే ఉంది. మొదటిసారి ఐపీఎల్‌లో ఎలా ఆడతాడని అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. రంజీ పోటీల్లో 8 మ్యాచ్లో 17 వికెట్లు తీసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ప్రస్తుతం కాకినాడలో ఉంటున్నాడు. ఈ కుర్రాడికి ప్లేయింగ్-11లో చోటు దక్కుతుందేమో వేచి చూడాలి.
News March 22, 2025
తూ.గో: ఆరేళ్ల తర్వాత సంచలన తీర్పు

కామవరపుకోట(M) గుంటుపల్లి బౌద్ధాలయాల వద్ద 2019లో ప్రేమజంటపై దాడి జరిగింది. ఈక్రమంలో యువతిని హత్య చేశారు. గోపాలపురం నియోజకవర్గం ద్వారకాతిరుమల(M) జి.కొత్తపల్లికి చెందిన సోమయ్య(22), గంగయ్య(20), నందివాడ(M) అరిశెల గ్రామానికి చెందిన నాగరాజును నిందితులుగా గుర్తించారు. వీరికి జీవిత ఖైదు విధిస్తూ పోక్సో కోర్టు జడ్జి సుమా సునంద శిక్ష విధించారని ఏలూరు SP ప్రతాప్ శివకిషోర్ వెల్లడించారు.