News February 13, 2025
కొవ్వూరులో హీరో రామ్ సినిమా షూటింగ్

సినీ హీరో రామ్ పోతినేని 22వ సినిమా షూటింగ్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం ఆరికిరేవుల గ్రామంలో జరిగింది. మైత్రీ మూవీస్ బ్యానర్లో నిర్మిస్తున్న ఈ సినిమాకు ఇంకా పేరు పెట్టలేదు. మంగళవారం ఆరికిరేవుల స్నానఘట్టం, గోదావరి నది వద్ద సన్నివేశాలను చిత్రీకరించారు. ఇందులో భాగంగా బుధవారం నటుడు రావు రమేశ్ తో పలు సీన్లు చిత్రీకరించారు.
Similar News
News December 4, 2025
హిడ్మాది ఎన్కౌంటర్ కాదు.. హత్య అంటూ లేఖ

<<18318593>>హిడ్మా<<>> ఎన్‌కౌంటర్‌పై దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ప్రతినిధి వికల్ప్ పేరిట లేఖ విడుదల చేశారు. హిడ్మా, శంకర్‌ను ఎన్కౌంటర్ చేయలేదని, ఇది పూర్తిగా భూటకపు హత్యలని విమర్శించారు. అనారోగ్యంతో ఉన్న హిడ్మా, శంకర్ చికిత్స కోసం విజయవాడకు వెళ్తుండగా అరెస్ట్ చేశారన్నారు. వారం రోజుల పాటు వారిని చిత్రహింసలు పెట్టి చంపారని ఆరోపించారు. హత్యలపై న్యాయవిచారణ చేసి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
News December 4, 2025
కడప జిల్లాలో 21 మంది ఎస్ఐల బదిలీలు

కడప జిల్లాలో భారీగా ఎస్ఐల బదిలీలు జరిగాయి. జిల్లా వ్యాప్తంగా 21 మంది ఎస్ఐలను బదిలీ చేస్తూ గురువారం కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ఆదేశాలు జారీ చేశారు. బదిలీ అయినవారు సంబంధిత స్టేషన్లలో రిపోర్టు చేసుకోవాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ బదిలీలు చోటుచేసుకున్నాయని పలువురు చర్చించుకుంటున్నారు.
News December 4, 2025
బత్తాయిలో ‘తొడిమ కుళ్లు’ తెగులు – లక్షణాలు

బత్తాయి తోటలను కాయ తయారయ్యే దశలో తొడిమ కుళ్లు తెగులు ఆశిస్తుంది. కాయ పక్వానికి రాకముందే తొడిమ నుంచి ఊడి రాలిపోవటం ఈ తెగులు ప్రధాన లక్షణం. ఈ కాయలను పరిశీలిస్తే వాటికి తొడిమ ఉండదు. ఈ తెగులు ప్రభావం ఎక్కువగా కొమ్మ చివరి భాగాల్లో, అభివృద్ధి చెందుతున్న కాయ తొడిమలపై ఉంటుంది. బలహీనంగా వున్న చెట్లలో ఈ తెగులు ప్రభావం ఎక్కువ. వర్షాలు, వాతావరణంలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ తెగులు వేగంగా వ్యాపిస్తుంది.


