News April 24, 2024

కొవ్వూరు ప్రధాన రహదారిపై ACCIDENT

image

ప.గో. జిల్లా కొవ్వూరు ప్రధాన రహదారిలోని పెట్రోల్ బంక్ సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 9 మందికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏలూరు నుండి 9 మంది ప్రయాణుకులతో కొవ్వూరు వైపు వస్తున్న ఓమ్నీ వ్యాన్ పెట్రోల్ బంక్ వద్ద యూటర్న్ తీసుకుంటున్న లారీని బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని కొవ్వూరు ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స చేసి రాజమండ్రి తరలించారు.

Similar News

News January 22, 2025

ప.గో జిల్లాలో గంజాయిని అరికట్టాలి: ఎస్పీ

image

పాలకోడేరు మండలం గొల్లలకోడేరులోని పోలీసులు కార్యాలయంలో ఎస్పీ అద్నాన్ నయీం అస్మి నేర సమీక్షను మంగళవారం నిర్వహించారు. ముఖ్యమైన ప్రాపర్టీ కేసుల గురించి ఆరా తీశారు. నిందితులు అరెస్ట్ అయిన కేసుల్లో త్వరితగతిన ఛార్జ్‌షీట్ దాఖలు చేసి.. బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గంజాయి పూర్తిగా అరికట్టేలా కృషి చేయాలన్నారు.

News January 22, 2025

ప.గో జిల్లాలో కోళ్లకు మిక్స్‌డ్ వైరస్

image

ప.గో జిల్లాలో కోళ్లు <<15211030>>చనిపోతున్న <<>>విషయం తెలిసిందే. శీతాకాలంలో కోళ్లకు ఇలాంటి మిక్స్‌డ్ వైరస్ రావడం సహజమేనని పశువర్ధక శాఖ డీడీ జవహర్ హుస్సేన్ స్పష్టం చేశారు. ‘గాలి, నీరు, కోళ్ల ద్వారా వైరస్ వ్యాపిస్తుంది. వైరస్ సోకిన కోడిని కాల్చేయాలి. ముందు జాగ్రత్తగా RDF1, RDK, పాల్‌పాక్స్ టీకాలు వేయించాలి. యాంటి వైరల్ ఇన్పెక్టెంట్ లేదా బయోబస్టార్ పౌడర్‌ను లీటర్ నీటికి ఓ గ్రాము కలిపి తాగించాలి’ అని ఆయన సూచించారు.

News January 22, 2025

భీమవరంలో ఫోన్ చోరీ.. 6 నెలల జైలుశిక్ష

image

మొబైల్ చోరీ చేసిన వ్యక్తికి భీమవరం కోర్టు జైలుశిక్ష విధించింది. గతేడాది భీమవరం వీరమ్మ పార్క్ వద్ద ఓ వ్యక్తి నడుచుకుంటూ వెళ్తుండగా తణుకు ఏరియాకు చెందిన వరదా దినకరన్ అడ్డుకున్నాడు. అతడిని బెదిరించి ఫోన్ తీసుకుని పారిపోయాడు. వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. నేరం నిరూపణ కావడంతో వరదా దినకరన్‌కు 6 నెలల జైలు శిక్ష విధిస్తూ జడ్జి ధనరాజ్ తీర్పు వెలువరించారు.