News January 29, 2025
కొవ్వూరు: బాలిక కిడ్నాప్.. ఆపై లైంగిక వేధింపులు

బాలికను పెళ్లి చేసుకుంటానని కిడ్నాప్ చేసి లైంగిక వేధింపులకు పాల్పడిన డి. కిరణ్ కుమార్ పై పోక్సో కేసు నమోదు చేసినట్లు కొవ్వూరు ఎస్సై కే. శ్రీహరిరావు తెలిపారు. కడియానికి చెందిన ఫ్యామిలీ సంక్రాంతికి కొవ్వూరుకు వచ్చారు. సొంతూరు వెళ్లే క్రమంలో 14 ఏళ్ల బాలిక మిస్సైంది. తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. బాలిక ఆచూకీ కనుగొనగా.. ఆమె తెలిపిన వివరాలతో యువకుడిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
Similar News
News December 17, 2025
లక్ష్యాల సాధనకు పక్కా ప్రణాళికలు రూపొందించాలి: సీఎం

సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన బుధవారం ప్రారంభమైన ఐదో జిల్లా కలెక్టర్ల సదస్సులో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి పాల్గొన్నారు. వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగాల్లో జిల్లా పురోగతిని సీఎం సమీక్షించారు. GSDP వృద్ధి లక్ష్యాలను చేరుకోవడానికి జిల్లా స్థాయిలో పక్కా ప్రణాళికలతో ముందుకు సాగాలని కలెక్టర్లను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలని సూచించారు.
News December 17, 2025
తూ.గో: సంక్రాంతి కి స్పెషల్ ట్రైన్స్ వచ్చేస్తున్నాయ్..

సంక్రాంతి పండుగ సందర్భంగా జిల్లా మీదుగా పలు స్పెషల్ ట్రైన్స్ నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్ – శ్రీకాకుళం రోడ్డు మధ్య 07288/ 07289 నంబర్ రైళ్లు జనవరి 9,10,11,12 తేదీలలో రాకపోకలు ఉంటాయి. 07290/07291 నంబర్ రైళ్లు సికింద్రాబాద్ -శ్రీకాకుళం రోడ్డు మధ్య 10, 11, 12, 13, 16, 17, 18, 19 తేదీల్లోనూ, శ్రీకాకుళం రోడ్డు సికింద్రాబాద్కు 07295 రైలు జనవరి 14న ట్రైన్స్ నడవనున్నాయి.
News December 17, 2025
తూ.గో: ‘జిల్లాలో ధాన్యం సేకరణ విజయవంతం’

తూర్పు గోదావరి జిల్లాలో ఖరీఫ్ 2025–26 సీజన్లో ధాన్యం సేకరణ విజయవంతంగా కొనసాగుతోందని జేసీ వై. మేఘ స్వరూప్ మంగళవారం తెలిపారు. రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ద్వారా డిసెంబర్ 16, 2025 నాటికి జిల్లాలో 42,977 మంది రైతుల నుంచి రూ. 770.74 కోట్ల విలువ చేసే 3,25,345 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామన్నారు. ఇప్పటివరకు 37,308 మంది రైతులకు రూ. 659.76 కోట్లను చెల్లించినట్లు ఆయన వివరించారు.


