News January 29, 2025

కొవ్వూరు: బాలిక కిడ్నాప్.. ఆపై లైంగిక వేధింపులు

image

బాలికను పెళ్లి చేసుకుంటానని కిడ్నాప్ చేసి లైంగిక వేధింపులకు పాల్పడిన డి. కిరణ్ కుమార్ పై పోక్సో కేసు నమోదు చేసినట్లు కొవ్వూరు ఎస్సై కే. శ్రీహరిరావు తెలిపారు. కడియానికి చెందిన ఫ్యామిలీ సంక్రాంతికి కొవ్వూరుకు వచ్చారు. సొంతూరు వెళ్లే క్రమంలో 14 ఏళ్ల బాలిక మిస్సైంది. తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. బాలిక ఆచూకీ కనుగొనగా.. ఆమె తెలిపిన వివరాలతో యువకుడిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

Similar News

News February 10, 2025

తూ.గో: మార్చి 8 వరకు పీజీఅర్ఎస్ రద్దు

image

ఫిబ్రవరి 27న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం కోసం ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్నికలు జరగనున్న దృష్ట్యా జిల్లా, డివిజన్, మండల స్థాయిలో ప్రతి సోమవారం జరిగే పీజీఆర్ఎస్ సెషన్‌లు రద్దు చేశామని జిల్లా కలెక్టర్ ప్రశాంతి ఆదివారం ప్రకటించారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు (మార్చి 8) ఈ రద్దు అమలులో ఉంటుందని, అర్జీదారులు గమనించాలని విజ్ఞప్తి చేశారు.

News February 9, 2025

దేవరపల్లి హైవేపై ప్రమాదం.. ఐదుగురికి గాయాలు

image

దేవరపల్లి మండలం గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి సమీపంలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. దేవరపల్లి మండలం సంగాయిగూడెం గ్రామానికి చెందిన భార్యాభర్తలు ముగ్గురు పిల్లలతో కలిసి కొవ్వూరు వైపు బైక్‌పై వెళ్తుండగా ప్రమాదవశాత్తు జారిపడి ప్రమాదానికి గురయ్యారు. భార్య, భర్త, కుమారుడిని గోపాలపురం ప్రభుత్వాసుపత్రికి తరలించగా మిగిలిన ఇద్దరు కుమార్తెలను మరో ఆసుపత్రికి తరలించారు.

News February 9, 2025

రోడ్డు ప్రమాదంలో తాడేపల్లిగూడెం మహిళ మృతి

image

ప్రత్తిపాడులో నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో తాడేపల్లిగూడెం(M) కొండ్రుపోలుకు చెందిన లక్ష్మి మృతిచెందింది. భర్త సత్యనారాయణతో దువ్వలో బంధువుల ఇంటికి వెళ్లి వస్తుండగా ప్రత్తిపాడు హైవేపై ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆమె తలకు గాయమై చనిపోయింది. భర్త ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు SI స్వామి తెలిపారు.

error: Content is protected !!