News February 22, 2025
కొవ్వూరు: హీరో రామ్‌ను కలిసిన మంత్రి దుర్గేశ్

కొవ్వూరు సమీపంలోని కుమారదేవంలో మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్లో జరుగుతున్న #RAPO22 షూటింగ్‌కి వచ్చిన ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ పోతినేని, డైరెక్టర్ పి.మహేష్ బాబులను రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ శనివారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చిత్ర బృందం మంత్రి దుర్గేశ్‌కి ఘన స్వాగతం పలికింది. ఈ సినిమా మంచి విజయం సాధించాలని మంత్రి ఆకాంక్షించారు.
Similar News
News March 20, 2025
పిఠాపురం సభపై పవన్ కళ్యాణ్ ట్వీట్

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జయకేతనం సభ నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. తన ‘x’ ఖాతా వేదికగా ..జనసేన పార్టీ సిద్ధాంతాలు ఇవే అంటూ ప్రకటన చేశారు. రాజకీయ కార్యక్రమాలు, ఇతర కార్యక్రమాల అనంతరం సభా ప్రాంగణాన్ని శుభ్రపరిచి అందజేశామని అదే జనసేన సిద్ధాంతమని ఆయన పేర్కొన్నారు .
News March 20, 2025
కొవ్వూరు: పట్టపగలే మహిళా మెడలో గొలుసు చోరీ

కొవ్వూరు పట్టణంలోని మహిళ మెడలో నుంచి గొలుసు లాక్కెళ్లిన ఘటన కలకలం రేపింది. కొవ్వూరుకు చెందిన కందుల పద్మ కుమారి (55) అనే మహిళ ఏసి ఆర్ లాడ్జ్ సమీపంలో వాకింగ్ చేస్తుండగా వెనుక నుంచి మోటార్ సైకిల్ పై వచ్చి ఆగంతకుడు మెడలో నుంచి చైన్‌ను లాక్కెళ్లాడు. స్థానికుల సమాచారంతో పట్టణ సీఐ విశ్వం డీఎస్పీ దేవకుమార్ ఘటన స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News March 20, 2025
ధవలేశ్వరం: హత్య కేసులో ముద్దాయికి జీవిత ఖైదు

రూరల్‌లోని 2019లో ధవలేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసులో కోర్టు ముద్దాయికి జీవిత ఖైదు, 5 వేల జరిమానా విధించింది. బుధవారం రాజమండ్రి కోర్టులో వాద ప్రతి వాదనలు విన్న తర్వాత జడ్జి విజయ్ గౌతమ్ ముద్దాయి దాడి గణేష్‌కు జీవిత ఖైదు విధించారు. భార్యపై అనుమానంతో దాడిచేసి చంపినట్లు రుజువైందని పీపీ లక్ష్మణ్ నాయక్ తెలిపారు. ధవలేశ్వరం సీఐ గణేష్, హెచ్సీ జయ రామరాజు ముద్దాయిని కోర్టులో హాజరు పరిచారు.