News April 3, 2025
కోకో సాగుకు కోనసీమ అనువైన వాతావరణం: కలెక్టర్

కోనసీమ జిల్లాలో కోకో పంట సాగు చేసేందుకు అనువైన వాతావరణం ఉందని కలెక్టర్ మహేశ్ కుమార్ అన్నారు. ఆయన అమలాపురంలోని కోనసీమ జిల్లా కలెక్టరేట్ వద్ద గురువారం జిల్లా స్థాయి కోకో కమిటీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో కోకో సాగు విస్తీర్ణాన్ని దసలవారీగా పెంచుతూ జిల్లాను కోకో హబ్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. కోకో ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుపై చర్చించారు.
Similar News
News April 5, 2025
HYD: ఆ బస్సుల్లోనూ మహిళలకు FREE..!

HYDలో అనేక ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. సాధారణ బస్సుల కంటే ఎలక్ట్రిక్ బస్సులు లగ్జరీగా ఉండడంతో కొందరు ప్రయాణికులు వాటిలో మహిళలకు ఉచిత ప్రయాణం అందించే మహాలక్ష్మి పథకం వర్తించదనే అపోహ పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు ఎలక్ట్రిక్ బస్సులపై మహాలక్ష్మి FREE పథకం వర్తిస్తుందని స్టిక్కర్లు అంటించారు.
News April 5, 2025
కొటికలపూడి వద్ద రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి

అద్దంకి మండలంలోని కొటికలపూడి గ్రామం వద్ద శుక్రవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పశువులు మేపుకోవడం కోసం వెళ్లిన కోటేశ్వరమ్మ అనే మహిళ రోడ్డు దాటుతుండగా ద్విచక్రవాహనం ఢీకొనడంతో మృతి చెందింది. ద్విచక్ర వాహనదారుడికి తీవ్ర గాయాలయ్యాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News April 5, 2025
సంగారెడ్డి: హాస్టల్ విద్యార్థి మిస్సింగ్

వట్పల్లి మండల పరిధిలోని దేవునూరు సాంఘిక సంక్షేమ వసతి గృహం విద్యార్థి అదృశ్యమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తప్పిపోయిన విద్యార్థి తల్లిదండ్రులు వట్పల్లి పోలీస్టేషన్లో శుక్రవారం ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విద్యార్థి ఆచూకీ కోసం దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.