News April 18, 2024

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తరఫున నామినేషన్ దాఖలు

image

నెల్లూరు రూరల్ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తరఫున మాజీ మేయర్ భానుశ్రీ నెల్లూరు రూరల్ రిటర్నింగ్ అధికారి మలోలకు గురువారం నామినేషన్ పత్రాలను అందజేశారు. ఎటువంటి హంగు ఆర్భాటం లేకుండా మాజీ మేయర్ భానుశ్రీతో పాటు టీడీపీ నేతలు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. గతంలో 2014, 19 ఎన్నికల్లో కూడా కోటంరెడ్డి పోటీ చేశారు. ఇది వరుసగా మూడోసారి కావడం గమనార్హం.

Similar News

News February 27, 2026

ప్రతి పోలీసుకు అండగా ఉంటాం: SP

image

నెల్లూరు ఎస్పీ డా.అజిత వేజెండ్ల ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది సమస్యల పరిష్కారం కోసం ‘డయల్ యువర్ ఎస్పీ’ (SP-సంపర్క్) కార్యక్రమం నిర్వహించారు. శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో 13 మంది సిబ్బంది తమ బదిలీలు, మెడికల్ బిల్లులు, ప్రమోషన్ల వంటి అంశాలను నేరుగా ఎస్పీకి ఫోన్ ద్వారా వివరించారు. ఈ సమస్యలపై సానుకూలంగా స్పందించిన ఎస్పీ క్షేత్రస్థాయిలో పనిచేసే ప్రతి పోలీస్ వెనుక శాఖ ఉంటుందని భరోసా ఇచ్చారు.

News February 27, 2026

నెల్లూరు: ఈ నంబర్లతో అమ్మాయిలకు రక్ష.!

image

మహిళల భద్రత కోసం రూపొందించిన ‘శక్తి’ యాప్‌పై నెల్లూరు ఎస్పీ డా.అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు పోలీసులు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా బస్టాండ్లు, కళాశాలల్లో మహిళలు, విద్యార్థినులకు ఈ యాప్ డౌన్లోడ్ విధానం, ఆపద సమయంలో పోలీసుల తక్షణ సాయం పొందే తీరును వివరిస్తున్నారు. దీనితో పాటు డయల్ 100, 112, 1930 వంటి హెల్ప్‌లైన్ నంబర్లపై కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

News February 27, 2026

ఫొక్సో కేసులపై నెల్లూరు SP కీలక ఆదేశాలు

image

ఫొక్సో కేసులలో అభియోగ పత్రాల దాఖలు వేగవంతం చేయాలని ఎస్పీ డా.అజిత వేజెండ్ల అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆమె జిల్లా పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సైబర్ ఫ్రాడ్ కేసులలో హోల్డ్ మనీ రికవరీ వేగవంతం కావాలన్నారు. అందుకు సంబందించి అధికారులకు అవగహన కల్పించారు.