News February 14, 2025

కోటగిరి పంచాయతీ కార్యదర్శికి కఠిన కారాగార శిక్ష

image

లంచం తీసుకున్న కేసులో కోటగిరి పంచాయతీ కార్యదర్శి సుదర్శన్‌కు ఏడాది కఠిన కారాగార శిక్ష, రూ. 40,000 జరిమానా విధిస్తూ ఏసీబీ నాంపల్లి కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి మహమ్మద్ ఆఫ్రొజ్ అక్తర్ తీర్పు నిచ్చారు. 2014లో వడ్డే నర్సింహులు తండ్రి పేరు మీద ఉన్న ఇళ్లను అయన, అతని సోదరుడి పేరు మీద బదిలీ చేయడం కోసం కార్యదర్శి రూ.8,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కోర్టు విచారించి, తీర్పునిచ్చింది.

Similar News

News March 16, 2025

NZB: GREAT.. గ్రూప్- 2, 3లో సత్తా చాటిన SI

image

గ్రూప్-3 ఫలితాల్లో NZB <<15733792>>డిచ్పల్లి 7వ బెటాలియన్ రిజర్వుడ్ SI ఓరంగంటి అశోక్ మరోసారి స్టేట్ 14వ ర్యాంకు <<>>సాధించారు. SI స్వస్థలం వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం, లింగాపూర్ గ్రామం. ఇటీవల విడుదలైన గ్రూప్-3 ఫలితాల్లో 320 మార్కులు సాధించి BC(A)తో పాటు, భద్రాద్రి జోన్ టాపర్‌గా నిలిచారు. అలాగే గ్రూప్-2లో సైతం స్టేట్ 57 ర్యాంక్, BC(A)లో ఫస్ట్ ర్యాంకు సాధించారు. గ్రూప్- 2,3లో సత్తా చాటిన SI పై మీ కామెంట్?

News March 16, 2025

పేదవాడి ఫ్రిజ్.. ఆదిలాబాద్ రంజన్లకు భలే గిరాకీ

image

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గత మూడు రోజుల నుంచి ఎండలు తారస్థాయికి చేరాయి. ఎండ తీవ్రత నుంచి ఉపశమనం పొందడానికి చల్లని నీరు కోసం ప్రజలు రంజన్లను భారీగా కొనుగోలు చేస్తున్నారు. పలు కూడళ్లలో అదిలాబాద్, నిర్మల్, రాజస్తాన్ తదితర ప్రాంతాల రంజన్లను బట్టి రూ. 100 – 450 విక్రయిస్తున్నారు. సహజ సిద్ధమైన మట్టితో తయారు చేసిన రంజన్ నీరు ఆరోగ్యానికి మంచిదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

News March 16, 2025

NZB: యాక్సిడెంట్.. బోల్తా పడ్డ కారు

image

నిజామాబాద్ నగరంలో రోడ్డు ప్రమాదం జరిగింది. జీజీ కాలేజీ సమీపంలో బైపాస్‌పై ఓ బాలుడు సైకిల్ మీద వచ్చాడు. సైకిల్‌ను తప్పించే ప్రయత్నంలో బాలుడిని కారు ఢీకొట్టింది. దీంతో కారు అదుపుతప్పి బోల్తాపడింది. సైకిల్ పై ఉన్న బాలుడితో సహ కారులో ఉన్న ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

error: Content is protected !!