News January 9, 2025
కోటగిరి: రెండు బైకులు ఢీ ఒకరు మృతి
కోటగిరి నుంచి ఎత్తోండ వెళ్లే రోడ్డుపై బుధవారం రెండు బైకులు ఢీ కొనడంతో లక్ష్మణ్(55) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. లక్ష్మణ్ తన పొలం నుంచి కోటగిరికి తిరిగి వెళ్తుండగా మరో వ్యక్తి కోటగిరి నుంచి ఎత్తోండ వెళ్లే క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఎత్తోండకు చెందిన వ్యక్తికి గాయాలవడంతో 108 అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలాన్ని ఎస్ఐ సందీప్ సందర్శించి వివరాలను సేకరించారు.
Similar News
News January 14, 2025
నవీపేట్: సంక్రాంతి వేడుకల్లో అపశృతి
నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలంలో పండగ పూట విషాదం చోటుచేసుకుంది. చైనా మంజాతో ఓ యువకుడి గొంతుతో పాటు రెండు వేళ్లు తెగాయి. దీంతో వెంటనే అతణ్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. చైనా మాంజా వాడొద్దని అధికారులు, పోలీసులు హెచ్చరిస్తున్నా దుకాణదారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇకనైనా చైనా మాంజాను వాడకూడదని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
News January 14, 2025
NZB: గల్ఫ్‌లో యాక్సిడెంట్.. రూ.55 లక్షల పరిహారం
గల్ఫ్‌లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం జ్యాగిర్యాల గ్రామానికి చెందిన గద్దల రాజు కుటుంబానికి రూ.55 లక్షల పరిహారం యాబ్ లీగల్ సర్వీసెస్ సీఈవో సలాం పాపినిస్సేరి సోమవారం అందజేశారు. 2022లో గల్ఫ్‌లో రాజు రోడ్డు దాటుతుండగా ప్రమాదం జరిగి మృతి చెందారు. యాబ్ లీగల్ సర్వీసెస్ ద్వారా పరిహారం వచ్చింది. షేక్ ఆల్ అజీజ్, రవుఫ్, మునీత్ తదితరులు పాల్గొన్నారు.
News January 14, 2025
బాల్కొండ: హైవేపై యాక్సిడెంట్ యువకుడి మృతి
బాల్కొండ మండలం చిట్టాపూర్ వద్ద నేషనల్ హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ బైక్‌ను ఢీకొట్టడంతో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి స్వగ్రామం నిర్మల్ జిల్లా బొప్పారం అని బాల్కొండ ఎస్ఐ నరేష్ తెలిపారు. పండగ వేళ తీవ్ర విషాదమని, అత్యంత వేగంగా వెళ్ళడమే ప్రమాదానికి కారణమని ఎస్ నరేష్, ఏఎస్ఐ శంకర్ తెలిపారు.