News August 7, 2024
కోటగిరి: రేషన్ బియ్యాన్ని పట్టుకున్న పోలీసులు
కోటగిరిలో బాలాజీ ట్రేడర్స్ రైస్ మిల్లుపై బుధవారం టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. రేషన్ బియ్యంతో వెళ్తున్న 2 లారీలను గుర్తించి, 270క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. మిల్లు యజమానితో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీ నిఖిల్ రాజ్ తెలిపారు. నెల రోజుల క్రితం ఈ రైస్ మిల్లుపై ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడులు చేసి 80 క్వింటాళ్ల బియ్యం పట్టుకున్నారు.
Similar News
News September 17, 2024
NZB: సార్వజనిక్ గణేశ్ మండలి వద్ద ఎమ్మెల్యేలు, కలెక్టర్, సీపీ పూజలు
వినాయక నిమజ్జనోత్సవాన్ని పురస్కరించుకుని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, NZB అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ తదితరులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం దుబ్బ ప్రాంతంలోని సార్వజనిక్ గణేశ్ మండలి వద్దకు చేరుకొని కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. ప్రశాంత వాతావరణంలో నిమజ్జనోత్సవాలు జరుపుకోవాలని కలెక్టర్, సీపీ సూచించారు.
News September 17, 2024
NZB: నిమజ్జనానికి వేళాయె.. సర్వం సిద్ధం.!
11 రోజుల పాటు విశేష పూజలందుకున్న లంబోదరుడు మరి కొన్ని గంటల్లో గంగమ్మ ఒడికి చేరనున్నాడు. ఈ మేరకు నిజామాబాద్ జిల్లా కేంద్రంతో పాటు నందిపేట మండలంలోని ఉమ్మెడ, బాసర గోదావరి తీరాన ఏర్పాట్లు అధికారులు పూర్తి చేశారు. నిమజ్జనం సందర్భంగా 2 వెల మంది పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏర్పాట్లపై ఆదివారం చంద్ర శేఖర్ రెడ్డి పోలీసు ఉన్నత అధికారులకు సలహా, సూచనలు చేశారు.
News September 17, 2024
వర్ని: కొడవలితో భార్య గొంతుకోసి హత్య చేసిన భర్త
భార్య గొంతుకోసి భర్త హత్య చేసిన ఘటన వర్నిలో చోటుచేసుకుంది. ఎస్ఐ కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని వడ్డేపల్లి గ్రామానికి చెందిన పెంటవ్వ(46), భర్త బాలయ్య మధ్య సోమవారం రాత్రి గొడవ జరిగింది. మద్యం మత్తులో ఉన్న బాలయ్య క్షణికావేశంలో కొడవలితో ఆమె గొంతు కోయడంతో పెంటవ్వ అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్ఐ వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.