News June 20, 2024
కోటగిరి: రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి

రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందిన ఘటన కోటగిరి మండలంలో చోటు చేసుకుంది. కోటగిరి మండలం కొత్తపల్లికి చెందిన సాయి, పోశవ్వ దంపతులు బైక్‌పై బుధవారం మండల కేంద్రానికి వెళ్లారు. సాయంత్రం తిరిగి కొత్తపల్లికి వెళ్తుండగా ఏక్లాస్ పూర్ వద్ద బైక్ అదుపుతప్పి కిందపడటంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News February 24, 2026
NZB: గోదావరి పుష్కర ఏర్పాట్లపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలి

2027 జూలై 23 నుంచి ఆగస్టు 3 వరకు జరుగనున్న గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని చేపట్టాల్సిన ఏర్పాట్లపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని NZB కలెక్టర్ ఇలా త్రిపాఠి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. గత పుష్కరాల్లో గోదావరిలో పుష్కర స్నానం చేసిన భక్తుల సంఖ్య, భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన స్టాళ్లు, తాగునీరు, తాత్కాలిక గదులు, వాహనాల పార్కింగ్, భద్రత, రూట్ మ్యాప్ ఇతర ఏర్పాట్ల వివరాలను చూడాలన్నారు.
News February 24, 2026
NZB: శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు: CP

నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని CP సాయి చైతన్య హెచ్చరించారు. సోమవారం ఆయన రుద్రూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ కాలనీలో పర్యటించారు. ఎలాంటి సమస్యలు ఉన్నా సంబంధిత పోలీస్ అధికారులకు లేదా డయల్ 100కు సమాచారం అందించాలని తెలిపారు. అలాగే అల్లర్లు జరిగితే ఎవరిని ఉపేక్షించవద్దని, కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.