News April 13, 2025
కోటగిరి: సెల్ఫోన్ ఎక్కువగా వాడొద్దని మందలించినందుకు ఆత్మహత్య

సెల్ఫోన్ ఎక్కువగా వాడొద్దని మందలించినందుకు యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కోటగిరికి చెందిన లక్ష్మణ్ (20) అనే యువకుడు ఎక్కవ సమయాన్ని సెల్ ఫోన్ వాడకానికి కేటాయిస్తున్నాడని తండ్రి మందలించాడు. దీంతో మనస్తాపం చెందిన లక్ష్మణ్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్సై సందీప్ తెలిపారు. మృతుని తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై పేర్కొన్నారు.
Similar News
News October 22, 2025
మేడారం జాతర విజయవంతంగా జరిగేలా ఏర్పాట్లు చేయాలి: సబ్యసాచి ఘోష్

మేడారం మహాజాతర ఏర్పాట్లపై గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్ సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి, ప్రపంచ ప్రసిద్ధి గాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర విజయవంతంగా జరిగేలా ఏర్పాట్లు పూర్తి చేయాలని అన్నారు. లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీపీ శ్రీ మహేశ్ భగత్, ములుగు, వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు.
News October 22, 2025
బిట్స్ పిలానీలో ఉద్యోగాలు

హైదరాబాద్లోని బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, పిలానీ ఇన్స్ట్రక్టర్/ విజిటింగ్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఎంఈ, ఎంటెక్, బీఈ, బీటెక్తో పాటు పని అనుభవంగల అభ్యర్థులు నవంబర్ 16 వరకు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://www.bits-pilani.ac.in/
News October 22, 2025
ఆర్ట్స్ కళాశాలలో ప్రారంభమైన డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు

సుబేదారిలోని ఆర్ట్స్ & సైన్స్ కళాశాలలో బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల మూడు, ఐదవ సెమిస్టర్ పరీక్షలు బుధవారం ప్రారంభమైనట్లు కళాశాల ప్రిన్సిపల్ ప్రొ.సుంకరి జ్యోతి తెలిపారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పరీక్షా కేంద్రంలో తగిన ఏర్పాట్లు అలాగే పర్యవేక్షణ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. వైస్ ప్రిన్సిపల్ రెహమాన్, పరిశీలకులు డా.మంద శ్రీనివాస్, శ్రీదేవి అధ్యాపకులు పాల్గొన్నారు.