News August 20, 2024
కోటగుళ్లను అభివృద్ధి చేస్తాం: మంత్రి సీతక్క
కోటగుళ్లను మరింతగా అభివృద్ధి చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మంగళవారం గణపురం మండలం కోటగుళ్లను సందర్శించారు. గణపురం కోటగుళ్ల విశిష్ఠత మాటల్లో చెప్పలేనిదని, తప్పనిసరిగా గణపురం కోటగుళ్లను మరింతగా అభివృద్ధి చేసి వరంగల్ జిల్లాలోనే పేరుగాంచిన ప్రాంతంగా తీర్చిదిద్దుతామన్నారు.
Similar News
News September 19, 2024
వరంగల్ రైల్వే స్టేషన్లో బాటిల్ క్రషింగ్ మిషన్
వరంగల్ రైల్వే స్టేషన్ వద్ద ఉన్న ప్రయాణికులకు రైల్వే అధికారులు సింగల్ యూజ్ ప్లాస్టిక్‌పై అవగాహన కల్పించారు. సికింద్రాబాద్ రైల్వే డివిజన్ మేనేజర్ భర్తేష్ కుమార్ జైన్ ఆదేశాల మేరకు వరంగల్ రైల్వేస్టేషన్లో బాటిల్ క్రషింగ్ మిషన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వాటర్ బాటిల్స్ లాంటివి ఈ యంత్రంలో పడవేస్తే, తుక్కు తుక్కుగా మారుస్తుందని అధికారులు రైల్వే ప్రయాణికులకు తెలిపారు.
News September 19, 2024
సైన్స్ సెంటర్‌ను పరిశీలించిన ఎమ్మెల్యే, కలెక్టర్
హనుమకొండలోని రీజనల్ సైన్స్ సెంటర్లో ఆధునిక సైన్స్ వనరుల కల్పనతో పాటు అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేసి అందజేయాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, కలెక్టర్ పి.ప్రావీణ్య సైన్స్ సెంటర్ అధికారులను ఆదేశించారు. రీజనల్ సైన్స్ సెంటర్‌ను జిల్లా అధికారులతో కలిసి నేడు ఎమ్మెల్యే పరిశీలించారు. సైన్స్ సెంటర్‌కు కావాల్సిన ఆధునిక సైన్స్ వనరుల గురించి అడిగి తెలుసుకున్నారు.
News September 19, 2024
NSPT: అక్రమ అరెస్టులను ఖండించిన మాజీ మంత్రి హరీశ్ రావు
నర్సంపేట నియోజకవర్గంలో మాజీ MLA పెద్ది సుదర్శన్ రెడ్డితో సహా పలువురు బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్టు చేయడాన్ని మాజీ మంత్రి హరీశ్ రావు ఖండించారు. మెడికల్ కళాశాల ఏర్పాటు చేసి జిల్లా ప్రజల ఆకాంక్షను కెసిఆర్ నెరవేర్చారని, నాటి అభివృద్ధిని కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకునేందుకు కుటిల యత్నాలకు పాల్పడుతుందని ‘X’లో మండిపడ్డారు. అరెస్ట్ చేసిన నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.