News February 12, 2026

కోటగుళ్లలో ఎస్పీ సంకీర్త్ పూజలు

image

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని గణపురం మండలంలోని చారిత్రక కోటగుళ్లను ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ సందర్శించారు. ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, జాతర ఏర్పాట్లపై పోలీసు అధికారులతో సమీక్షించారు. శివరాత్రి వేళ భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూలైన్లు, వాహనాల పార్కింగ్ వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

Similar News

News March 13, 2026

27,360 మంది విద్యార్థుల‌కు 149 సెంట‌ర్లు: కలెక్టర్

image

ఈ నెల 16వ నుంచి ఏప్రిల్ 1 వ‌ర‌కు జ‌ర‌గ‌నున్న 10వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు నిర్వహించనున్నట్లు NTR క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ తెలిపారు. పరీక్షల నిర్వ‌హ‌ణ‌కు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామ‌న్నారు. ఎక్క‌డా ఇబ్బంది లేకుండా విద్యార్థులు స‌జావుగా ప‌రీక్ష‌లు రాసేందుకు సౌక‌ర్యాలు క‌ల్పిస్తున్న‌ట్లు శుక్ర‌వారం ఆయన డీఈవో చంద్ర‌క‌ళ‌తో క‌లిసి క‌లెక్ట‌రేట్‌లో స‌మావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.

News March 13, 2026

శ్రీకాకుళం: మాజీ డీజీపీ మృతి

image

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ డీజీపీ హెచ్.జె.దొర శుక్రవారం కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. శ్రీకాకుళం జిల్లా జర్జంగి గ్రామానికి చెందిన ఆయన.. విధి నిర్వహణలో అత్యంత నిజాయతీ, నిబద్ధత గల పోలీసు అధికారిగా చెరగని ముద్ర వేశారు. దొర ఆకస్మిక మరణం పోలీసు శాఖకు, ఆయన సొంత జిల్లాకు తీరని లోటు.

News March 13, 2026

టెన్త్‌ పరీక్షలకు కట్టుదిట్టమైన భద్రత: ఎస్పీ

image

జిల్లాలో ఈ నెల 14 నుంచి వచ్చే నెల 16 వరకు జరిగే పదో తరగతి వార్షిక పరీక్షలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. పరీక్షలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన నిఘా ఉంచామన్నారు. పరీక్షా కేంద్రాల పరిసరాల్లో 163 బీఎన్ఎస్ఎస్ (144 సెక్షన్) అమలులో ఉంటుందని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.