News November 16, 2024
కోటనందూరులో యువతి అదృశ్యంపై కేసు నమోదు
కోటనందూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని యువతి అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాలు ప్రకారం..తుని మండలం ఎన్ ఎస్ వెంకటనగరం చెందిన విమల (22) అనే యువతి శుక్రవారం ఉదయం నుంచి కనిపించడం లేదని తండ్రి సింహాచలం ఫిర్యాదు చేశారన్నారు. యువతి ప్రతిరోజు కోటనందూరులో టైలరింగ్ శిక్షణ నేర్చుకునేందుకు వస్తుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. వివరాల తెలిస్తే తమను సంప్రదించాలన్నారు.
Similar News
News December 12, 2024
రాజమండ్రిలో పర్యటించనున్న కేంద్రమంత్రి రామ్మోహన్
రాజమండ్రి-ఢిల్లీ విమాన సర్వీసు ప్రారంభోత్సవానికి కేంద్ర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర భాజపా అధ్యక్షురాలు ఎంపి పురందేశ్వరి గురువారం రాజమండ్రి విచ్చేస్తున్నారని రాజనగరం నియోజక వర్గ భాజపా కన్వినర్ నీరుకొండ వీరన్న చౌదరి తెలిపారు. వారి పర్యటనను విజయవంతం చేయాలని కూటమి నేతలను కోరారు. రాజమండ్రి నుంచి తిరుపతి, వారణాసి, షిర్డీకి కూడా విమాన సర్వీసులు నడిపేలా చర్యలు తీసుకోవాలన్నారు.
News December 11, 2024
సుకుమార్: మట్టపర్రు To పాన్ ఇండియా
పుష్ప పార్ట్-1, 2లతో పాన్ ఇండియా హిట్ అందుకున్న డైరెక్టర్ సుకుమార్‌ది మన జిల్లానే. ఆయన ఉమ్మడి తూ.గో.జిల్లా మలికిపురం మండలం మట్టపర్రు గ్రామంలో 1970లో జన్మించారు. చిన్నప్పటి నుంచే పుస్తక పఠనంపై ఆసక్తి కనబరిచే వారు. ఉన్నత చదువులు చదివిన ఆయన మ్యాథ్స్ లెక్చరర్‌గా పనిచేశారు. 2004లో ఆర్య మూవీతో డైరెక్టర్‌గా సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి హిట్‌లు అందుకున్నారు. ఇప్పటివరకు ఆయన 8 సినిమాలకు దర్శకత్వం వహించారు.
News December 11, 2024
ప్రత్తిపాడు: పులి ఆచూకీ కోసం గాలింపు
ప్రత్తిపాడు మండలం బురదకోట అటవీ ప్రాంతంలో పెద్ద పులి ఆచూకీ కోసం ఏలేశ్వరం ఫారెస్ట్ రేంజర్ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో మంగళవారం ముమ్మరంగా గాలించారు. ఎంత వెతికినా పులి జాడ మాత్రం కనిపించలేదు. దాని కోసం 6 ట్రాప్ కెమెరాలను బురదకోట పరిసర ప్రాంతంలో ఏర్పాటు చేశారు. అనంతరం పులి ఆచూకీ తెలుసుకునేందుకు చేపట్టాల్సిన అంశాలపై రేంజర్ సమావేశం నిర్వహించి సిబ్బందికి సూచనలిచ్చారు.