News February 8, 2025
కోటనందూరు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో గాయాలైన వ్యక్తి చికిత్స పొందుతూ నిన్న మృతి చెందినట్లు SI రామకృష్ణ తెలిపారు. ఈనెల 2న కోటనందూరు హెరిటేజ్ పాయింట్ వద్ద బైక్ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బొద్దవరానికి చెందిన సుర్ల రాజబాబు (30) అనే వ్యక్తి బైక్ నుంచి జారిపడటంతో తలకు గాయమైంది. అతడిని కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడన్నారు.
Similar News
News November 27, 2025
జనగామ: పంచాయతీ ఎన్నికలు.. నిఖిల ఆదేశాలు

గ్రామ పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగేలా ప్రత్యేక శ్రద్ధతో పని చేయాలని ఎన్నికల సాధారణ పరిశీలకులు నిఖిల నోడల్ అధికారులకు సూచించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి జనగామ జిల్లాకి జనరల్ అబ్జర్వర్గా నిఖిల నియామకమైన నేపథ్యంలో గురువారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. గ్రామ ప్రంచాయతీల ఎన్నికలు సజావుగా నిర్వహించాలని ఆదేశించారు.
News November 27, 2025
SRCL: ‘త్వరలోనే BRSను బొందపెడుతరు’

బీఆర్ఎస్ నేతల తీరుపై కాంగ్రెస్ కార్యకర్తలు ఫైర్ అయ్యారు. వేములవాడ పట్టణంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. త్వరలోనే బీఆర్ఎస్ పార్టీని ప్రజలు బొంద పెడతారని, తమ నాయకుడిని విమర్శించే స్థాయి వారికి లేదని లోకల్ బీఆర్ఎస్ నాయకులపై ఫైర్ అయ్యారు. మాట్లాడాల్సిన వ్యక్తిని జర్మనీ పంపించి ఇప్పుడు విమర్శలు చేస్తున్నారా అని విమర్శించారు.
News November 27, 2025
నారాయణపేట జిల్లాలో 69 సర్పంచ్ నామినేషన్లు

నారాయణపేట జిల్లాలోని నాలుగు మండలాల్లో గురువారం 67 గ్రామ పంచాయతీలకు గాను, సర్పంచ్ పదవులకు 69 నామినేషన్లు, 572 వార్డులకు 38 నామినేషన్లు దాఖలయ్యాయి. అత్యధికంగా కొత్తపల్లి మండలంలో సర్పంచ్ పదవులకు 26 నామినేషన్లు రాగా.. వార్డులకు 8 నామినేషన్లు వచ్చాయి. కోస్గిలో 19, 25, మద్దూరులో 16, 4, గుండుమల్లో 8, 1.. సర్పంచ్, వార్డులకు నామినేషన్లు దాఖలయ్యాయి.


