News January 27, 2025
కోటపల్లి: జాతీయస్థాయికి ఎంపికైన విద్యార్థికి కలెక్టర్ ప్రశంస

గణతంత్ర దినోత్సవం సందర్భంగా మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం అన్నారం జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల విద్యార్థి శ్రావణ్ కుమార్, గైడ్ టీచర్ సురేందర్ కలెక్టర్ కుమార్ దీపక్ నుంచి ప్రశంసాపత్రం అందుకున్నారు. జిల్లా నుంచి ఇన్‌స్పైర్మానక్ పోటీల్లో జాతీయస్థాయికి శ్రావణ్ కుమార్, గైడ్ టీచర్ సురేందర్‌ను కలెక్టర్ అభినందించారు.
Similar News
News February 23, 2026
వరంగల్ మున్సిపాలిటీల్లో కోఆప్షన్ కోలాహలం

ఉమ్మడి వరంగల్ జిల్లా మున్సిపాలిటీల్లో పాలక వర్గాల ఏర్పాటు ముగియడంతో, ఇప్పుడు అందరి దృష్టి ‘కోఆప్షన్’ సభ్యుల ఎంపికపై పడింది. పట్టణ అభివృద్ధిలో కీలకమైన ఈ నామినేటెడ్ పదవుల కోసం ద్వితీయ శ్రేణి నాయకులు, ఆశావహులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికల్లో టికెట్ దక్కని వారు, పార్టీ కోసం శ్రమించిన వారు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని చూస్తున్నారు. దీంతో మున్సిపల్ కార్యాలయాల్లో సందడి నెలకొంది.
News February 23, 2026
కొత్తగూడెంలో తగ్గిన గాలి నాణ్యత.. 136కు చేరిన AQI

కొత్తగూడెం జిల్లాకేంద్రంలో వాయుకాలుష్యం కోరలు చాస్తోంది. ఆదివారం(FEB22) కొత్తగూడెంలో వాయు నాణ్యత సూచీ(AQI) ఒక్కసారిగా 136కు చేరింది. గాలిలో PM2.5, PM10 వంటి సూక్ష్మ ధూళి కణాలు ప్రమాదకర స్థాయికి చేరడమే ఇందుకు ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. గాలి నాణ్యత అనారోగ్యకర స్థాయికి చేరడంతో చిన్నారులు,వృద్ధులు శ్వాసకోశ ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. 100 లోపు AQI ఉంటే నాణ్యమైన గాలిగా తేల్చారు.
News February 23, 2026
ఆసిఫాబాద్: GREAT.. పగలు సర్పంచ్.. రాత్రి గురువు

వాంకిడి మండలం జముల్ధారి గ్రామం సర్పంచ్ కుంరమ్ పవన్ కుమార్ ఆదర్శంగా నిలుస్తున్నారు. పగటిపూట గ్రామంలో తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారుల వంటి సమస్యల పరిష్కారంలో నిమగ్నమై ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. రాత్రివేళల్లో విద్యార్థులకు ఉచితంగా పాఠాలు బోధిస్తూ వారి భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారు. ప్రజాప్రతినిధిగా, గురువుగా ద్వంద్వ పాత్ర పోషిస్తున్న పవన్‌ను గ్రామస్థులు అభినందిస్తున్నారు.


