News April 14, 2025

కోటపల్లి: నవదంపతుల సూసైడ్

image

పెళ్లైన 6 నెలలకే దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. కోటపల్లి (M) దేవులవాడకు చెందిన సృజన(30) లక్షెట్టిపేటలో డిగ్రీ చదువుతోంది. కులాలు వేరే కావడంతో పెద్దలను ఎదురించి సీనియర్ విష్ణువర్ధన్‌‌ను ప్రేమ వివాహం చేసుకుంది. ఈ క్రమంలో విష్ణువర్ధన్ మార్చి 24న గోదావరిలో దూకి సూసైడ్ చేసుకున్నాడు. దీంతో మనస్తాపానికి గురైన సృజన ఇంట్లోనే ఉరేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కుబుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

Similar News

News January 9, 2026

ఉజ్వలతో బాలికల భవితకు భరోసా: జనగామ కలెక్టర్

image

ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళలకు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడానికి పోష్ చట్టం ఎంతగానో దోహద పడుతుందని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ చట్టం 2013 మీద మహిళా ఉద్యోగులకు జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కాన్ఫెరెన్స్ హాల్‌లో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో డీసీపీ రాజమహేంద్ర నాయక్ పాల్గొన్నారు.

News January 9, 2026

చిత్తూరు: ‘ఒత్తిడి చేయడంతోనే హత్య’

image

వివాహ విషయమై ఒత్తిడి చేయడంతోనే కవితను హత్య చేసినట్లు గణేశ్ విచారణలో ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. ‘అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగం వచ్చిన తర్వాత ఉత్తిడి మరింత ఎక్కువ అయింది. DEC 31న యల్లమరాజుపల్లె సమీపంలో ఆమెను బైక్‌పై ఎక్కించుకొని GDనెల్లూరు వద్ద నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. రాత్రి 10.45 గంటలకు ఆమెపై దాడి చేసి హత్య చేశాడు. అనంతరం డెడ్ బాడిని నీవానది వద్ద పడేశాడు’ అని పోలీసులు తెలిపారు.

News January 9, 2026

TET ఫలితాలు విడుదల

image

AP: రాష్ట్రంలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(TET) ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 2.48 లక్షల మంది ఎగ్జామ్స్ రాయగా 97,560 మంది ఉత్తీర్ణులైనట్లు అధికారులు తెలిపారు. అభ్యర్థులు అధికారిక <>వెబ్‌సైట్లో<<>> ఫలితాలు తెలుసుకోవచ్చు. డిసెంబర్ 10న మొదలైన ఈ ఆన్‌లైన్ పరీక్షలు 21వ తేదీ వరకు కొనసాగాయి. ఇప్పటికే ప్రాథమిక కీ విడుదల చేశారు. సమాధానాలకు సంబంధించి అభ్యంతరాలు కూడా స్వీకరించారు.