News February 8, 2025

కోటపల్లి: MLC అభ్యర్థిగా సంపత్ యాదవ్ నామినేషన్

image

మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం మల్లంపేట గ్రామానికి చెందిన అంగ సంపత్ యాదవ్ ఉమ్మడి ఆదిలాబాద్,మెదక్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల పట్టభద్రుల స్వతంత్ర అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. జిల్లా కేంద్రంలో శాసనమండలి రిటర్నింగ్ అధికారి పమేల సత్పతికి తన నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు. 

Similar News

News March 28, 2025

వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ కొట్టివేత

image

AP: సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వైసీపీ నేత వల్లభనేని వంశీకి చుక్కెదురైంది. వంశీ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను విజయవాడ అట్రాసిటీ కేసుల కోర్టు కొట్టివేసింది. ఐవో, ప్రాసిక్యూషన్ జేడీకి షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

News March 28, 2025

NZB: నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు: డీఈవో

image

నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ ఒంటి పూట బడుల నేపథ్యంలో రెండు పూటల బడులు నిర్వహించే పాఠశాలల పై ఎటువంటి నోటీసులు లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని నిజామాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ నోటీస్ జారీ చేశారు. జిల్లాలో పలు ప్రైవేటు విద్యాసంస్థలు వేసవి కాలంలో రెండు పూటలు బడులు నిర్వహిస్తున్నారని వస్తున్న ఫిర్యాదుల మేరకు సంబంధిత ప్రైవేటు యాజమాన్యాలకు ఆయన సూచనలు చేశారు.

News March 28, 2025

VKD: ఇంటి వద్దకే తలంబ్రాలు.. ఫోన్ చేయండి

image

ఆర్టీసీ కార్గో ద్వారా ఇంటి వద్దకే రాములోరి తలంబ్రాలు పంపిస్తామని వికారాబాద్ డిపో మేనేజర్ గడ్డం అరుణ అన్నారు. భక్తులు కేవలం రూ.151 చెల్లించి, సమీపంలోని కార్గో కార్యాలయంలో ఏప్రిల్ 6లోగా బుకింగ్ చేసుకోవాలన్నారు. మిగతా వివరాలకు వికారాబాద్ డిపో-91542 98740, చేవెళ్ల డిపో-91775 67300, తొరమామిడి-77995 20031 నంబర్లకు సంప్రదించాలన్నారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

error: Content is protected !!