News February 13, 2026
కోటప్పకొండకు వెళ్తున్నారా..? ఈ నంబర్ సేవ్ చేసుకోండి!

కోటప్పకొండ తిరునాళ్లకు వచ్చే భక్తులు లేదా వారి కుటుంబ సభ్యులు తప్పిపోయినట్లయితే వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు. కొండ క్రింది 4 రోడ్ల జంక్షన్ వద్ద, కొండపై రాజగోపురం వద్ద ఏర్పాటు చేసిన పోలీసు అవుట్ పోస్టులలో సమాచారం ఇవ్వవచ్చు. సమీపంలో ఉన్న ఏ పోలీసు సిబ్బందికైనా తెలియజేసినా కంట్రోల్ రూమ్ ద్వారా వివరాలు చేరవేస్తారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలిగినా 9440900885 సంప్రదించాలన్నారు.
Similar News
News March 13, 2026
MNCL: ప్రభుత్వ ఉద్యోగం రాలేదని యువకుడి ఆత్మహత్య

ప్రభుత్వ ఉద్యోగం రాలేదని మనస్తాపంతో ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. దేవాపూర్ ఎస్సై గంగారాం కథనం ప్రకారం.. కాసిపేట మండలం లంబాడితండా(డి)కు చెందిన హరీశ్(28) డిప్లొమా పూర్తి చేసి, ఇంజినీరింగ్ మధ్యలో ఆపేసి ప్రైవేట్ ఉద్యోగం చేస్తూనే డిగ్రీ పూర్తి చేశాడు. పలు ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ పడినా ఫలితం దక్కలేదు. ప్రైవేట్ కొలువు చేయలేక, ఒత్తిడికి లోనైన యువకుడు సూసైడ్ నోటు రాసి ఇంట్లో ఉరేసుకున్నాడు.
News March 13, 2026
భద్రాచలం: శ్రీరామ నవమి.. 400కు పైగా SPL. బస్సులు

భద్రాచలం శ్రీరామ నవమి వేడుకలకు TGSRTC, APSRTCలు భారీ ఏర్పాట్లు చేశాయి. ఖమ్మం రీజియన్ నుంచి 234, ఏపీ నుంచి 172 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్ఎం సరిరామ్ తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా విజయవాడ, హైదరాబాద్‌లకు అదనపు సర్వీసులను కేటాయించారు. భద్రాచలం జూనియర్ కళాశాల నుంచి ఆలయం వరకు భక్తులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించనున్నారు.
News March 13, 2026
వరంగల్: రే‘వూరి’లో ఆమె రాక ఇబ్బంది!

కాంగ్రెస్‌లో వర్గ విభేదాలు తారా స్థాయికి చేరాయి. వరంగల్ జిల్లాలో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని గీసుకొండలో కలెక్టర్ సత్యశారద ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి పొంగులేటి వస్తారనే ఉద్దేశ్యంతో MLA రేవూరి ప్రకాశ్ రెడ్డి గీసుకొండలో ప్లాన్ చేశారు. మంత్రి పర్యటన రద్దవడంతో ముఖ్య అతిథిగా మంత్రి సురేఖ హజరయ్యారు. దీంతో MLAలు రేవూరి, KR నాగరాజులు డుమ్మా కొట్టారు.


