News March 10, 2025
కోటప్పకొండలో ఐఏఎస్ అధికారి పూజలు

నరసరావుపేట మండలంలోని ప్రముఖ శైవ క్షేత్రమైన కోటప్పకొండ పై వేంచేసి ఉన్న త్రికోటేశ్వర స్వామిని ఐఏఎస్ అధికారి మైలవరపు కృష్ణ తేజ ఆదివారం దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలను ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబుతో కలిసి నిర్వహించారు. ఆలయ అధికారులు,అర్చకులు వారికి స్వాగతం పలికారు. స్వామి వారి మహిమలను తెలిపారు. శేష వస్త్రాన్ని, ప్రసాదాలను, త్రికోటేశ్వరుని చిత్రపటాన్ని కృష్ణ తేజకు అందించి సత్కరించారు.
Similar News
News December 5, 2025
ఖమ్మం: KUలో త్వరలోనే ఫేస్ రికగ్నిషన్ హాజరు..!

కాకతీయ యూనివర్సిటీలో టీచింగ్, నాన్టీచింగ్(రెగ్యులర్, కాంట్రాక్టు, టైంస్కేల్, ఔట్సోర్సింగ్) ఉద్యోగులకు ఫేస్ రికగ్నిషన్ హాజరు విధానం అమలు చేయడానికి కేయూ సిద్ధమైంది. ఈనెల 6, 8వ తేదీల్లో ఉద్యోగులు తమ విభాగాల్లో అందుబాటులో ఉండాలని, ఫొటో క్యాప్చర్ కోసం ఎప్పుడు పిలిస్తే అప్పుడు పరిపాలన భవనానికి హాజరవాల్సిందిగా రిజిస్ట్రార్ రామచంద్రం వాట్సాప్ గ్రూప్ ద్వారా సూచించినట్లు సమాచారం.
News December 5, 2025
నల్గొండ: హంగు లేదు.. ఆర్భాటమూ లేదు!

గత పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ వేసే రోజున ప్రధాన పార్టీలు మద్దతు తెలిపిన అభ్యర్థులు భారీ ర్యాలీ తీసి, డప్పుచప్పుళ్లతో జనసమీకరణ చేసి నామినేషన్ దాఖలు చేసేవారు. అదే సందడి పోలింగ్ ముగిసే వరకు కొనసాగించే
వారు. ఈసారి ఎన్నికల్లో అభ్యర్థులు హంగు, ఆర్భాటం లేకుండా నామినేషన్ దాఖలు చేయడం, గుట్టచప్పుడు కాకుండా ఇంటింటా ప్రచారం చేస్తున్నారు. అన్ని గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.
News December 5, 2025
ఏప్రిల్ నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు: మంత్రి

TG: వచ్చే మూడేళ్లలో అర్బన్ ప్రాంతాల్లోనూ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు. తొలి విడతలో 4 లక్షల ఇళ్లను మంజూరు చేశామని, వచ్చే ఏడాది మార్చి నాటికి లక్ష ఇళ్లకు గృహప్రవేశాలు చేస్తామన్నారు. ఏప్రిల్ నుంచి రెండో విడత ఇళ్ల పంపిణీని ప్రారంభిస్తామని ప్రకటించారు. ఇళ్ల పంపిణీ నిరంతర ప్రక్రియ అని, అర్హులందరికీ ఇస్తామని తెలిపారు.


