News February 28, 2025
కోటప్పకొండ తిరునాళ్లలో వైసీపీ విద్యుత్ ప్రభపై దాడి

కోటప్పకొండ తిరునాళ్లలో గోనెపూడి వైసీపీ ఎలక్ట్రికల్ ప్రభపై కొందరు దాడి చేసి ప్రభకు నిప్పంటించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొండ కింద ఏర్పాటు చేసిన 22 ఎలక్ట్రికల్ ప్రభలలో ఒకటి మాత్రమే వైసీపీ ప్రభ ఉంది. ఈ ఘటన సమయంలో వైసీపీ ప్రభ దగ్గరకు వైఎస్సార్ అభిమానులు భారీగా చేరుకున్నారు. తిరునాళ్లలో గోనెపూడి ప్రభ వద్ద జగన్ పాటలు వేయడంతో ప్రత్యర్థులు డీజే బాక్స్లను ధ్వంసం చేశారన్నారు.
Similar News
News November 28, 2025
MHBD: భూమి పేరు మార్పిడికి లంచం డిమాండ్

మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర తహశీల్దార్ మహేందర్ <<18414245>>లంచం<<>> తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కారు. పోచంపల్లి పడమటి తండాకు చెందిన రైతు భూక్య బాలు తండ్రి పేరిట ఉన్న 3.09 గుంటల వ్యవసాయ భూమిని తన పేరు మీదకు మార్చడానికి తహశీల్దార్ రూ.25 వేలు డిమాండ్ చేయగా, రూ.15 వేలు తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ సాంబయ్య బృందం రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది.
News November 28, 2025
నాన్-ఏసీ కోచ్ల్లోనూ దుప్పటి, దిండు

రైలు ప్రయాణికులకు సదరన్ రైల్వే శుభవార్త చెప్పింది. 2026 జనవరి 1 నుంచి నాన్-ఏసీ స్లీపర్లో కూడా దుప్పటి, దిండు సౌకర్యం అందుబాటులోకి వస్తుందని ప్రకటించింది. ఇందుకోసం ప్రయాణికులు నిర్ణీత ఛార్జీలు చెల్లించాలని పేర్కొంది. ఈ మేరకు రూ.50, రూ.30, రూ.20లలో మూడు ప్యాకేజీలు తీసుకొచ్చింది. ఈ సౌకర్యాన్ని చెన్నై డివిజన్ ఎంపిక చేసిన 10 రైళ్లలో ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తోంది.
News November 28, 2025
సిద్దిపేట: గంగాపూర్లో ఘోర రోడ్డు ప్రమాదం

సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గంగాపూర్ గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రోడ్డుపై ఆరబోసిన వడ్ల కుప్పపైకి ద్విచక్ర వాహనం ఎక్కి కిందపడడంతో రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం తెనుగువానిపల్లెకు చెందిన రవీందర్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


