News March 18, 2024
కోటబొమ్మాలి: స్వేచ్ఛగా ఓటు వేయండి: కలెక్టర్

ఓటర్లు తమ ఓటుహక్కును నిర్భయంగా, స్వేచ్ఛగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి మనజీర్ జిలానీ సమూన్ పిలుపునిచ్చారు. కోటబొమ్మాళి మండలంలో ఆయన రిజర్వు పోలీసు దళాల ఫ్లాగ్ మార్చ్ లో సోమవారం మధ్యాహ్నం పాల్గొన్నారు. ఓటర్లు ఎటువంటి భయబ్రాంతులకు, ప్రలోభాలకు గురికావద్దని సూచించారు.
Similar News
News February 9, 2026
శ్రీకాకుళం: ఎస్పీ పీజీఆర్ఎస్‌లో 53 వినతులు

జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజల ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో 53 వినతులు అందినట్లు అదనపు ఎస్పీ కె.వి. రమణ తెలిపారు. జిల్లాలోని వివిధ మండలాల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలను ఆయనకు విన్నవించుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. అందిన వినతులపై తక్షణమే స్పందించి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
News February 9, 2026
SKLM: వరుస దొంగతనాలు.. ప్రజల హడల్

మందసలోని బాలిగాం గ్రామంలో వరుస దొంగతనాలు ప్రజలను హడలెత్తిస్తున్నాయి. కిల్లి శారదమ్మ ఇంట్లో తులమున్నర బంగారం, వల్లభ భూదేవి ఇంట్లో ఆరు తులాల వెండి పట్టుకొని పోయారు. దాంతో పాటు మార్పు భుజంగరావు ఇంట్లో బీరువాలను తెరిచి చిందర వందరగా పడేశారు. దీంతో ఒక్కసారిగా ఉలిక్కపడ్డ గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాశీబుగ్గ రూరల్ సీఐ తిరుపతిరావు, మందస ఎస్ఐ కృష్ణప్రసాద్ వివరాలు సేకరించారు.
News February 9, 2026
శ్రీకాకుళం: టెన్త్ విద్యార్థులకు గమనిక

పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 16 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు జరగనున్న విషయం తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం జరగనున్న ఎగ్జామ్స్‌లో ఓ పరీక్ష తేదీని మార్చినట్లు డీఈవో రవి కుమార్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. మార్చి 20న జరగాల్సిన ఇంగ్లిషు పరీక్ష, ఆ రోజు రంజాన్ కావడంతో మరుసటి రోజు 21న నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ మార్పును టీచర్లు, విద్యార్థులు గమనించాలన్నారు.


