News February 9, 2025

కోటబొమ్మాళి: చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

image

శ్రీకాకుళం రిమ్స్‌లో చికిత్స పొందుతూ సంతబొమ్మాళికి చెందిన రామారావు శనివారం కన్నుమూశారు. ఎస్సై వెంకటేశ్వరరావు కథనం..అతను జనవరి 28న భార్యను మద్యం తాగేందుకు డబ్బులు అడగగా .. మందలించిందని విషం తాగాడు. గమనించిన రామారావు కుమారుడు కుటుంబీకులకు సమాచారమిచ్చి ఆసుపత్రిలో చేర్చారు. కాగా చికిత్స పొందుతూ కోలుకోలేక శనివారం మృతిచెందారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

Similar News

News September 14, 2025

శ్రీకాకుళం డీఈఓగా రవిబాబు

image

శ్రీకాకుళం జిల్లా విద్యాశాఖ అధికారిగా రవిబాబుకు పూర్తి అదనపు బాధ్యతలను అప్పగిస్తూ శనివారం ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చాయి. DEO కార్యాలయంలో ADగా పనిచేస్తున్న రవిబాబును ఇప్పటివరకు ఇన్‌ఛార్జి DEOగా కొనసాగారు. జిల్లాలో విద్యా శాఖ అభివృద్ధికి అధికారుల సహాయంతో ముందడుగు వేస్తానని ఆయన అన్నారు.

News September 14, 2025

శ్రీకాకుళం: ప్రయాణాల్లో జాగ్రత్తలు తప్పనిసరి

image

ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటిస్తే వస్తువులు, నగదు పొగోట్టుకునే అవకాశం తక్కువుగా ఉంటుంది. ఎప్పటికప్పుడు చెకింగ్ చేసుకుంటే సామగ్రిని కాపాడుకోవచ్చు. ఇలాంటి చేదు అనుభవం శనివారం ఓ ప్రయాణికుడికి ఎదురైంది. శ్రీకాకుళంలోని టీసీబీకాలనీకి చెందిన ప్రణీత్ ఆర్టీసీ బస్సులో ఫోన్ మర్చిపోయి ఇంటికెళ్లి కాల్ చేశాడు. డ్రైవర్, కండక్టర్ వద్ద ఫోన్ సురక్షితంగా ఉందని తెలిసి సంతోషించాడు. అనంతరం బాధితుడికి మొబైల్ ఇచ్చారు.

News September 14, 2025

శ్రీకాకుళం: కొత్తమ్మ జాతరలో వీడియో పోటీలు

image

కోటబొమ్మాళి కొత్తమ్మ తల్లి జాతర ఈ నెల 23 నుంచి 25 వరకు ఘనంగా జరగనుంది. అమ్మవారి చరిత్ర, తదితర విషయాలను వీడియో రూపంలో చూపేందుకు పోటీలు నిర్వహించనున్నట్లు DRO వెంకటేశ్వరరావు శనివారం తెలిపారు. వీడియో 3 నుంచి 5 నిమిషాల నిడివితో పాటు ఆకర్షణగా ఉండలాని చెప్పారు. 16 తేదీ లోపు dsdosrikakulam@apssdc.in కు వీడియోలను పంపాలని ఆయన పేర్కొన్నారు.