News February 9, 2025
కోటబొమ్మాళి: చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

శ్రీకాకుళం రిమ్స్‌లో చికిత్స పొందుతూ సంతబొమ్మాళికి చెందిన రామారావు శనివారం కన్నుమూశారు. ఎస్సై వెంకటేశ్వరరావు కథనం..అతను జనవరి 28న భార్యను మద్యం తాగేందుకు డబ్బులు అడగగా .. మందలించిందని విషం తాగాడు. గమనించిన రామారావు కుమారుడు కుటుంబీకులకు సమాచారమిచ్చి ఆసుపత్రిలో చేర్చారు. కాగా చికిత్స పొందుతూ కోలుకోలేక శనివారం మృతిచెందారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
Similar News
News March 19, 2025
వంజంగి అమ్మాయికి గేట్‌లో 25వ ర్యాంక్

ఆమదాలవలస మండలం వంజంగి గ్రామానికి చెందిన పైడి పూజిత నేడు విడుదలైన గేట్-2025 ఫలితాలలో ఆల్ ఇండియా 25 ర్యాంకు సాధించారు. పూజిత నాగపూర్‌లోని వీఎన్ఐటీ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. పూజిత తండ్రి పైడి శ్రీనివాసరావు ఎల్.ఎన్.పేట ఎంపీడీవోగా పనిచేస్తున్నారు. పూజిత తల్లి ఆదిలక్ష్మి గృహిణి. గేట్‌లో వంద మార్కులకు గాను 73 మార్కులు సాధించినట్లు తండ్రి శ్రీనివాస రావు తెలిపారు.
News March 19, 2025
శ్రీకాకుళం పది పరీక్షలకు 129 మంది గైర్హాజరు

శ్రీకాకుళం జిల్లాలో పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. బుధవారం పది పరీక్షలకు హాజరైన విద్యార్థుల వివరాలను DEO తిరుమల చైతన్య ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 28,020 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 27,891 మంది హాజరైనట్లు వెల్లడించారు. 129 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మాల్ ప్రాక్టీస్ ఎక్కడా జరగలేదన్నారు. ప్రయివేటు విద్యార్థులు 14 మంది గైర్హాజరయ్యారన్నారు.
News March 19, 2025
వైసీపీ హయాంలో అక్రమాలపై విచారణ చేస్తాం: అచ్చెన్న

అవినీతి కోసమే పథకం అన్నట్లు గత వైసీపీ ప్రభుత్వ పాలన నడిచిందని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. బుధవారం అసెంబ్లీలో ఆయన వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. వాహనాల కొనగోళ్లు, నిర్వహణలో తప్పులు జరిగాయని తెలిపారు. వీటిలో జరిగిన అక్రమాలపై విచారణ చేస్తామని చెప్పారు. పూర్తి స్థాయి నివేదిక రాగానే కఠిన చర్యలు ఉంటాని పేర్కొన్నారు. నివేదిక సంతృప్తిగా లేకుంటే మరో ఉన్నత స్థాయి విచారణ జరిపిస్తామని చెప్పుకొచ్చారు.