News August 16, 2024

కోటబొమ్మాళి: యువకుడు అనుమానాస్పద మృతి

image

విజయనగరం సమీపంలోని రాళ్లమళ్లపురం గ్రామం పరిధిలోని రైల్వే ట్రాక్‌పై శుక్రవారం కోటబొమ్మాళి మండలం చిన్నహరిశ్చంద్రపురం గ్రామానికి చెందిన ఉప్పాడ జగదీశ్ (25) అనుమానాస్పదంగా మృతి చెందాడు. రైల్వే పోలీసులు వివరాల ప్రకారం.. జగదీశ్‌ విశాఖపట్నంలో ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడని వివరించారు. విజయనగరం ఎందుకు రావాల్సి వచ్చిందని, హత్యా లేక ఆత్మహత్యా? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

Similar News

News September 17, 2024

శ్రీకాకుళం: రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే చర్యలు తప్పవు-DM&HO

image

జిల్లాలో నడుపబడుచున్న ఆసుపత్రులు, క్లినిక్‌లు, ల్యాబ్‌లు తప్పనిసరిగా (ఆన్‌లైన్)లో రిజిష్టర్ చేసుకోవాలని DM&HO డా.మీనాక్షి ఒక ప్రకటనలో మంగళవారం కోరారు. రిజిస్ట్రేసన్ చేసుకోకపోతే చర్యలు తీసుకుంటామన్నారు. రిజిస్ట్రేషన్/రెన్యువల్ లేని వారు వెంటనే ఆన్‌లైన్‌లోని https:/ /clinicalesttact.ap.gov.in/ రిజిస్ట్రేసన్ చేసుకోవాలన్నారు. అలాగే స్కానింగ్ సెంటర్‌లో లింగ నిర్ధారణ చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

News September 17, 2024

శ్రీకాకుళం: ప్రధాన మంత్రి ఆవాస్ యోజన 2.O ప్రారంభం

image

కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన 2.O కార్యక్రమాన్ని వర్చ్యువల్ విధానంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకంలో లబ్ధిపొందిన లబ్ధిదారులకు గృహ ప్రవేశాలకు సంబంధించి తాళాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎమ్మెల్యే గుండు శంకర్, నడికుడి ఈశ్వరరావు పాల్గొన్నారు.

News September 17, 2024

SKLM: హెల్మెట్ లేకుంటే రూ.1035 ఫైన్

image

బైకు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ వాడాలని.. లేకుంటే ఫైన్ వేస్తామని శ్రీకాకుళం ట్రాఫిక్ సీఐ నాగరాజు హెచ్చరించారు. నగరంలోని 7 రోడ్ల కూడలి వద్ద మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి వాహనదారుడు హెల్మెట్ వాడకం అలవాటు చేసుకోవాలని సూచించారు. హెల్మెట్ లేకుంటే రోడ్లపైకి వస్తే రూ.1035 ఫైన్ వేస్తామని హెచ్చరించారు.