News April 14, 2025
కోటవురట్ల: మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి

కోటవురట్ల మండలం కైలాసపట్నం మందుగుండు తయారీ కేంద్రంలో జరిగిన ప్రమాదంలో మృతులకు ఆదివారం రాత్రి పోస్టుమార్టం పూర్తయింది. నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో ఆరు మృతదేహాలకు, పోస్టుమార్టం నిర్వహించగా అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రిలో రెండు మృతదేహాలకు పోస్టుమార్టం చేశారు. కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశాల మేరకు ఈ ప్రక్రియను వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తొందరగా ముగించారు.
Similar News
News January 4, 2026
నదీ జలాలు-కాంగ్రెస్ ద్రోహాలపై రేపు హరీశ్ రావు PPT

“నదీ జలాలు- కాంగ్రెస్ ద్రోహాలు” అనే అంశంపై మాజీ మంత్రి హరీశ్ రావు ఆదివారం ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్(PPT) ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు హాజరుకానున్నారు. నదీ జలాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను, జరుగుతున్న నష్టాన్ని ఈ సందర్భంగా ఆయన వివరించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
News January 4, 2026
గడువులోగా ఫొటో సిమిలర్ ఎంట్రీల పూర్తి

ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (SIR)లో భాగంగా ఫొటో సిమిలర్ ఎంట్రీ ప్రక్రియను నిర్దిష్ట గడువులోగా పూర్తి చేస్తామని జిల్లా ఎన్నికల అధికారి డా.సత్య శారద తెలిపారు. శనివారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆమె పాల్గొన్నారు. మున్సిపల్ కమిషనర్ చాహత్ వాజ్పేయి, అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి ఓటరు జాబితా స్వచ్ఛీకరణ, క్షేత్రస్థాయి పరిశీలన తీరును వివరించారు.
News January 4, 2026
భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

✓ఏసీబీకి చిక్కిన కొత్తగూడెం అటవీ అధికారులు
✓భద్రాచలం గోదావరికి కనుల పండుగగా నదీహారతి
✓జూలూరుపాడు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పై సస్పెన్షన్ వేటు
✓ఓటర్ల జాబితా సవరణ గడువులోగా పూర్తి చేయాలి: కలెక్టర్
✓పినపాక: అక్రమ ఇసుక నిలువలు సీజ్
✓బూర్గంపాడు: 9మంది కోడిపందాల రాయుళ్లు అరెస్ట్
✓దమ్మపేట: మందలపల్లి వద్ద పోలీసుల స్పెషల్ డ్రైవ్
✓దమ్మపేట: మైనర్ బాలిక పై వేధింపులు పోక్సో కేసు నమోదు


