News November 16, 2024

కోటి దీపోత్స‌వంలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి దంపతలు

image

సీఎం రేవంత్‌రెడ్డి కోటి దీపోత్స‌వంలో పాల్గొన్నారు. సమాజం అంతా సుఖశాంతులతో ఉండాల‌ని, ఇలాంటి పూజ కార్యక్రమం చేపట్టడం సంతోషక‌రం అని తెలిపారు. కార్తీకమాసం వస్తే శివయ్య భక్తులు హైదరాబాద్ వైపు చూసేలా ఒక అద్భుతమైన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయం అని, ఆ పరమేశ్వరుడి ఆశీస్సులతో తెలంగాణకు మేలు జరగాలని కోరుకుంటున్నానని తెలిపారు.

Similar News

News October 23, 2025

రాజేంద్రనగర్‌‌లోని NIRDPRలో ఉద్యోగాలు

image

రాజేంద్రనగర్‌లోని NIRDPRలో పని అనుభవం ఉన్నవారికి ఉద్యోగ అవకాశం కల్పిస్తున్నారు. UG, PG, PHD చేసి, అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది. రూ.50 వేల జీతంతో రీసెర్చ్ అసోసియేట్ 8 పోస్టులు, సీనియర్ ప్రాజెక్ట్ కన్సల్టెంట్ ఒక పోస్టుకు రూ.లక్ష వేతనం ఇవ్వనున్నారు. ఈ 9 ఉద్యోగాలను కాంట్రాక్ట్ బేసిక్ కింద భర్తీ చేస్తారు. R.Aకు 50 ఏళ్లు, SPCకి 65 ఏళ్లు మించొద్దు. OCT 29న వాక్-ఇన్ ఇంటర్వ్యూ ఉంటుంది.
SHARE IT

News October 23, 2025

పోచారం కాల్పులు.. రౌడీషీటర్ ఇబ్రహీం అరెస్ట్

image

పోచారం కాల్పుల ఘటనలో నిందితులు అరెస్ట్ అయ్యారు. CP సుధీర్ బాబు ఆదేశాలతో ప్రత్యేక బృందాలు ప్రధాన నిందితుడు ఇబ్రహీం, మోసిన్, శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్నాయి. మరో నిందితుడు హనీఫ్ ఖురేషి పరారీలో ఉన్నాడు. తరచూ తమ వ్యాపారానికి అడ్డొస్తున్నాడని కక్ష పెంచుకున్న ఇబ్రహీం, అతడి స్నేహితులు సోను మర్డర్‌కు ప్లాన్ చేశారు. ఈ క్రమంలోనే నిన్న <<18078700>>యంనంపేట్<<>>లోని కిట్టి స్టీల్ వద్ద అతడిపై కాల్పులు జరిపారు.

News October 23, 2025

BREAKING: జూబ్లీహిల్స్‌లో 130 మంది అభ్యర్థులు రిజెక్ట్

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భాగంగా కీలకమైన నామినేషన్ల స్క్రూటినీ పూర్తయింది. పలు కారణాలతో 130 మంది అభ్యర్థుల నామినేషన్లను ఎన్నికల అధికారులు రిజెక్ట్ చేశారు. 81 మంది నామినేషన్లను మాత్రమే యాక్సెప్ట్ చేశారు. మొత్తం 211 మంది అభ్యర్థులు 321 సెట్ల నామినేషన్లు దాఖలు చేయగా.. ఇందులో 186 సెట్ల నామినేషన్లు తిరస్కరణకు గురికావడం గమనార్హం. రేపు అభ్యర్థుల ఉపసంహరణకు అవకాశం ఉంది.