News February 3, 2025
కోట్ పల్లి: పార్టీ పటిష్టతే లక్ష్యంగా పనిచేయాలి: ఎమ్మెల్యే

పార్టీ పటిష్టతే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పని చేయాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం టీపీసీసీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సంతోష రాజు ఎంపిక కావడంతో డీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్యే రాంమోహన్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే ను శాలువాలతో సత్కరించి నియామక పత్రాన్ని వారికి అందజేశారు. మహిళలను భాగస్వామ్యం చేస్తూ పార్టీ పటిష్టతకు పని చేయాలన్నారు.
Similar News
News February 11, 2025
ప్రభాస్ ముగ్గురు చెల్లెళ్లను చూశారా?

దివంగత కృష్ణంరాజు సతీమణి శ్యామలా దేవి, ముగ్గురు కూతుళ్లు(ప్రసీద, ప్రదీప్తి, ప్రకీర్తి) బంధువుల పెళ్లిలో దిగిన ఫొటో వైరలవుతోంది. సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ ఈ వేడుకకు హాజరుకాలేదు. ఈ క్రమంలో చెల్లెళ్లంతా కలిసి డార్లింగ్కు త్వరగా వివాహం జరిపించాలని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. కృష్ణంరాజు తమ్ముడు సూర్యనారాయణ కొడుకే ప్రభాస్. ఇతనికి అన్న ప్రబోధ్(నిర్మాత), సోదరి ప్రగతి ఉన్నారు.
News February 11, 2025
అయిజ: గుండెపోటుతో RMP వైద్యుడు మృతి

అయిజ మండలంలో గుండెపోటుతో RMP వైద్యుడు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని వెంకటాపురం స్టేజీలో కొన్నేళ్లుగా వెంకట్రాముడు అనే వ్యక్తి RMP వైద్యుడిగా పని చేస్తున్నాడు. కాగా నేడు సాయంత్రం అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో మృతి చెందాడు. వైద్యుడి మృతితో పలు గ్రామాల ప్రజలు విచారణ వ్యక్తం చేశారు.
News February 11, 2025
శివరాత్రి సందర్భంగా అధికారులతో మంత్రి సురేఖ సమీక్ష

మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని మంత్రి సురేఖ ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా శివాలయాల్లో అవసరమైన ఏర్పాట్లపై దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు, ఈఓలతో సచివాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే వేములవాడ, కాళేశ్వరం, భద్రకాళి తదితర ఆలయాల్లో అవసరమైన ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. గతేడాది నిర్వహణ అనుభవాల ఆధారంగా ఈసారి చర్యలు చేపట్టాలన్నారు.