News January 31, 2025
కోట: అన్నను చంపిన తమ్ముడు

అన్నను తమ్ముడు హత్య చేసిన ఘటన కోట మండలంలో చోటు చేసుకుంది. కోట(M), జరుగుమల్లి గమళ్లపాళెంకు చెందిన కోటయ్య(46), మస్తానయ్య అన్నదమ్ములు. వీరు పక్కపక్కనే నివాసాలు ఉంటున్నారు. మస్తానయ్య భార్య గుడ్డలు ఉతికే క్రమంలో మురికినీరు అన్న కోటయ్య వాకాలిలోకి వెళ్లడంతో ఇద్దరు భార్యలు గొడవ పడ్డారు. ఈక్రమంలో కోటయ్య మస్తానయ్యపై దాడి చేయగా..తిరిగి మస్తానయ్య దాడి చేయడంతో కోటయ్య మృతి చెందాడు.
Similar News
News December 19, 2025
నెల్లూరు: 21 నుంచి పల్స్ పోలియో కార్యక్రమం

జిల్లాలో 21 నుంచి 23వ తేదీ వరకు 0-5 ఏళ్ల చిన్నారులకు పోలియో కార్యక్రమం జరగనుంది. 2.94 లక్షల మంది చిన్నారులకు చుక్కల మందు వేయనున్నారు. ఇప్పటికే గుర్తించిన 2396 పోలియో బూత్‌లలో వీరికి చుక్కలమందు వేయనుండగా.. 403 హై రిస్క్ ఏరియాలు, 82 మొబైల్ బూత్‌లు, బస్టాండ్, రైల్వేస్టేషన్ల వద్ద ప్రత్యేకంగా బూత్‌లను ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని 100 శాతం సక్సెస్ చేసేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.
News December 19, 2025
నెల్లూరు: స్మార్ట్ ఫోన్.. షార్ప్‌గా ప్రాణాలు తీస్తోంది.!

కాలం మారింది. చేతిలో ఫోన్ లేనిదే దిక్కుతోచని స్థితి. చిన్నపిల్లలు, పెద్దలు, విద్యార్థుల వరకు ఇదే పరిస్థితి. ఇదే మాయలో కేటుగాళ్లు అమ్మాయిలపై <<18607181>>పంజా<<>> విసురుతున్నారు. SM వేధికగా ట్రాప్ చేస్తే వేధింపులకు పాల్పడుతున్నారు. జొన్నవాడ ఆలయ ఉద్యోగి హిజ్రాను ట్రాప్ చేసి డబ్బులు తీసుకోవడం, నెల్లూరులో విద్యార్థిని ఆత్మహత్య ఇందుకు నిదర్శనం. ఫోన్లు వాడేటప్పుడు అమ్మాయిలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
News December 19, 2025
కోవూరు MLAతో ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్

నెల్లూరు ఇన్ఛార్జ్ మేయర్‌గా రూప్ కుమార్ యాదవ్ బాధ్యతలు తీసుకున్న అనంతరం పలువురు ప్రముఖులను కలుస్తున్నారు. ఈ నేపథ్యంలో నెల్లూరు నగరంలోని మాగుంట లేఔట్లో నివాసం ఉంటున్న కోవూరు MLA వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రశాంతి రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. నగర అభివృద్ధికి కృషి చేయాలని ఆమె రూప్ కుమార్ యాదవ్‌ను కోరారు.


